ప్రపంచ కప్ కామెంట్రీలో.. ముగ్గురు ఇండియన్స్?

praveen
ప్రపంచ కప్  ప్రారంభమైందంటే చాలు క్రికెట్ ప్రేక్షకులకు అసలు ఎంటర్టైన్మెంట్ అందుతూ ఉంటుంది. అయితే ఇక ప్రపంచకప్ లో ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా సాగడానికి కామెంటేటర్లదే ముఖ్య పాత్ర అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే మైదానంలో క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్లు సిక్సర్లు ఫోర్ లు కొట్టినప్పుడు లేదా వికెట్లు పడగొట్టినప్పుడు ఇక తమ  గాత్రంతో సన్నివేశాన్ని మరింత ఉత్కంఠ భరితంగా మార్చేస్తూ ఉంటారు కామెంటేటర్లు. ఈ క్రమంలోనే కామెంటేటర్లు ఇచ్చే కామెంట్రీ కారణంగానే ప్రేక్షకుల్లో మ్యాచ్ పై మరింత ఉత్కంఠ పెరిగిపోతూ ఉంటుంది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే టీ20 ప్రపంచకప్ ప్రారంభమైన నేపథంలో ప్రతి మ్యాచ్ ను ఉత్కంఠ భరితంగా మార్చేందుకు ఇక ఎంతో మంది కామెంట్రీటర్లను నియమించింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఇక ప్రపంచక ప్రారంభమైన నేపథంలో ఎక్కడ చూసినా ఇక క్రికెట్ సందడే కనిపిస్తుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రపంచ కప్ లో కామెంట్రీ వినిపించబోయేది ఎవరు అన్న ప్రశ్న గత కొంతకాలం నుంచి తెరమీదకి రాగా ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది అని చెప్పాలి.. ఎందుకంటే ప్రపంచకప్ ప్రారంభానికి ముందే ఇటీవలే క్రికెట్ కామెంట్రేటర్లు జాబితాను విడుదల చేసింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్.

 ఇకపోతే ఇందులో భాగంగా ముగ్గురు భారతీయులకు చోటు దక్కింది అని చెప్పాలి. ఇలా ఐసీసీ కామెంట్రీ ప్యానెల్ లో చోటు దక్కించుకున్న వారిలో  భారత మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి, మాజీ సారథి సునీల్ గవాస్కర్, ప్రముఖ వ్యాఖ్యాత హర్ష భోగ్లే కామెంట్రేటర్లుగా ఎంపిక అయ్యారు. ఇక ఇందుకు సంబంధించిన వినూత్నమైన వీడియోని ఐసీసీ ఇటీవల ట్విట్టర్ వేదికగా విడుదల చేయడంతో ఇది కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక క్రికెట్ అభిమానులు అందరినీ కూడా ఈ వీడియో అమితంగా ఆకట్టుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: