మళ్ళీ అదే పదవిలోకి సౌరవ్ గంగూలీ.. నిజమేనా?

praveen
భారత క్రికెట్ లో ఎన్నో ఏళ్లపాటు తనదైన శైలిలో సేవలందించిన సౌరబ్ గంగూలీ లెజెండరీ క్రికెటర్ గా ఎదిగాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇక బిసిసిఐ అధ్యక్షుడిగా కూడా అత్యున్నతమైన పదవిలో కొనసాగాడు అనే విషయం తెలిసిందే. అయితే అంతకుముందు బీసీసీఐ పదవిలో కొనసాగడానికి ముందు అటు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా ఆయన పని చేశారు అని చెప్పాలి. అయితే సౌరబ్ గంగూలీ లాంటి ఎంతగానో సేవలు అందించిన క్రికెటర్ బీసీసీఐ అధ్యక్షుడిగా రావడం పై ఎంతోమంది హర్షం వ్యక్తం చేశారు.

 ఇకపోతే బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరబ్ గంగూలీ బాధ్యతలు చేపట్టి నాటి నుంచి ఆయన తీసుకున్న  నిర్ణయాలు సంచలనాత్మకంగానే మారిపోయాయ్ అని చెప్పాలి. లేకపోతే ఇటీవలే సౌరవ్ గంగూలీ బిసిసిఐ అధ్యక్షుడు పదవీకాలం ముగిసింది. అయితే రెండోసారి బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగేందుకు గంగూలీ మంతనాలు జరిపినప్పటికీ అది కుదరలేదు. చివరికి ఆయన బీసీసీఐ అధ్యక్షుడిగా తప్పుకునే పరిస్థితి వచ్చింది. ఇక అతను స్థానంలో మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ బీసీసీఐ అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టబోతున్నాడు అన్నది తెలుస్తుంది.

 ఈ క్రమం లోనే ఇక బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న తర్వాత అటు సౌరబ్ గంగూలీ రానున్న రోజుల్లో ఎలాంటి పదవిని చేపట్టబోతున్నారు అనేది కూడా ఆసక్తికరం గా మారి పోయింది అని చెప్పాలి. అయితే బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టకు ముందు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ చీఫ్ పదవిలో కొనసాగారు సౌరవ్ గంగూలి. అయితే ఇప్పుడు మరోసారి అదే పదవికి పోటీ చేయబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ పోటీపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుంది అనే విషయంపై మాత్రం ఇప్పటివరకు క్లారిటీ లేదు అని చెప్పాలి. ఇక త్వరలోనే ఈ విషయంపై గంగూలీ అధికారిక ప్రకటన చేస్తారని అభిమానులు అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: