వన్డే వండర్.. ఏబీవీ వెంకట్రావు..!

Divya
చంద్రబాబు హయంలో పనిచేసిన ఇంటిలిజెంట్ చీఫ్ ఐపీఎస్ అధికారి ఏపీ వెంకటేశ్వరరావు ఈ రోజున పదవీ విరమణ చేస్తున్నారు. అయితే సరిగ్గా ఈరోజు ఆయన పోస్టింగ్ ఆర్డర్ల సైతం వెలుపడ్డాయి. సస్పెండ్ అయిన ఆయన సర్వీసులోకి తీసుకోవాలంటూ కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్  ఇచ్చిన సూచనలను పరిగణంలోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ప్రత్యేక ఆదేశాలను కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో కాస్త టీడీపీ ఈ విషయాన్ని విజయంగా కూడా ప్రచారం చేసుకుంటున్నది.

ఏపీ వెంకటేశ్వరరావు ఇంటిలిజెంట్ చీఫ్ గా ఉన్నప్పుడు చంద్రబాబు కోసం ఎన్నో అక్రమాలు చేశారని ఆరోపణలు కూడా వినిపించాయి. వైసిపి నేతల పైన నిగా పెట్టడం వారిపైన కేసులు బకాయించడం ఇలా చాలా దారుణాలు చేశారని కూడా విమర్శలు వినిపించాయి. అయితే వైసిపి పార్టీ వచ్చిన తర్వాత ఊహించని విధంగా సస్పెండ్ అయ్యారు. అయితే కోర్టు చుట్టులు తిరిగి ఎట్టకేలకు పదవి విరమణ రోజున ఈరోజు సింగిల్ డే డ్యూటీ చేస్తున్నారు. ఉదేశపూర్వకంగానే సి ఎస్ జోహార్ రెడ్డి ఆయన విధులకు దూరం పెట్టారని ఎల్లో మీడియా కూడా దుష్ప్రచారం చేసింది.

చివరి రోజున ఏబీవీ వెంకటేశ్వరరావు విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ అవ్వడంతో  ఎల్లో మీడియా ఈ విషయాన్ని పదే పదే చేస్తూ ఉన్నారు. వైసీపీ నేతలు మాత్రం ఈ ఒక్కడి కోసం టిడిపి మీడియా మొత్తం కదిలింది..చివరికి ఆయన ఆహ్వానం వీరందరినీ తృప్తిపరిచిందా అంటూ తెలుపుతున్నారు. ఇన్నేళ్లు చంద్రబాబుకు సేవ చేసినందుకు గాను ఆయన అనుకూల మీడియా ఉచిత ప్రచారంతో ఈయనను మారుమోగేలా చేస్తున్నారంటూ..అలాగే వన్డే వండర్ గా మిగిలిపోతారు. ఏపీ వెంకటేశ్వరరావు అంటూ తెలియజేస్తున్నారు వైసిపి నేతలు. ప్రస్తుతం ఈ విషయం టిడిపి నేతలను కాస్త అల్పసంతోషం పట్టుకొనేలా చేస్తోందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈయనకు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ స్టోర్ పర్చేస్ కమిషనర్ గా ఏబీవీకి పోస్టింగ్ ఇచ్చారు. ఈరోజు సాయంత్రమే ఉద్యోగ విరమణ కూడా చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: