Political Betting: ఏపీలో పొలిటికల్ బెట్టింగ్ హడావిడి.. మునిగేదెవరో?.. తేలేదెవరో?

lakhmi saranya
Political Betting:  నేతల తలరాతలు తేల్చే నాలుగో తేదీ ఎవరు గెలుస్తారో? ఎవరు ములుగుతారో తెలియదు కానీ.. ఆ రోజు పందెం రాయుళ్ల లో ఎవరు ములుగుతారో .. ఎవరు గెలుస్తారు.. పందెం గెలిచి ఎవరు తల ఎగరేస్తారో.. ఎవరు నెత్తిన గుడ్డ వేసుకుంటారో అనేది మాత్రం ఎంతో ఆసక్తిగా మారింది. లక్షలు, కోట్ల పందెం కాసిన బెట్టింగ్ కుర్రాళ్ళు మాత్రం నరాలు తెగే ఉత్కంఠకు గురవుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు.. క్రికెట్ మరియు పొలిటికల్ బెట్టింగ్ కి పెట్టింది పేరైనా కడప జిల్లాలో ఈ ఎన్నికల ఫలితాలపై భారీగానే బెట్టింగ్స్ సాగింది.

ఓ అంచనా ప్రకారం రూ. 50 కోట్లకు పైగా బెట్టింగ్ సాగి ఉంటుందని భావిస్తున్నారు. పందేలు ‌ కాసిన వారిలో కొందరు రాజకీయ నాయకులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. జిల్లాలో ఎన్నికల్లో నిలబడ్డ అభ్యర్థుల కంటే బెట్టింగ్ రాయుళ్ల ఎన్నికల సరళిని క్షేత్రస్థాయిలో ఆరా తీస్తున్నారు అంటే ఏ స్థాయిలో బెట్టింగ్ కు దిగారు మనం ఊహించుకోవచ్చు. రాష్ట్రంలో ఏర్పడబోయే ప్రభుత్వం ఏదన్నా దానిపైనే ఎక్కువగా పందాలు కాస్తున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తుందా? ఒంటరిగా బరిలో దిగిన జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధికారంలోకి వస్తుందా? అనే దానిపైనే ఎక్కువగా పందాలు కాసారు.

పోలింగ్ అయినా నాలుగు ఐదు రోజుల వరకు జగన్మోహన్ రెడ్డికి 80 సీట్లు వస్తాయని.. అన్ని రావని బెట్టింగ్ జరిగింది. పోలింగ్కు ముందు అయితే 70 నుంచి 80 వరకు సీట్లు వస్తాయి అని పందాలు కాసారు. పోలింగ్ ముగిసిన వారం నుంచి వైసీపీ అధికారంలోకి వస్తుందని.. కొందరు టిడిపి అధికారంలోకి వస్తుందని.. మరికొందరు రూపాయికి మరో రూపాయి కలిసి వస్తుందని బెట్టింగ్ కాసారు. ప్రభుత్వంపై కోట్ల రూపాయల్లో బెట్టింగ్ సాగింది. కడప బెట్టింగ్ కాస్త జిల్లా దాటి ఇతర జిల్లాలకు కూడా పాకింది. ప్రభుత్వం ఏ పార్టీకి వస్తుంది అనే దానితో పాటు చంద్రబాబుకు కుప్పం లో మెజారిటీ ఎంత, పవన్ కళ్యాణ్ కి పిఠాపురంలో ఎంత? మంగళగిరిలో లోకేష్ కి ఎంత అనే దానిపై కూడా బెట్టింగ్ జరుగుతుంది. మరి ఈ బెట్టింగ్స్ లో మునిగేదెవరో? తేలేదెవరో? మరో మూడు రోజుల్లో తెలియనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: