పోలవరం సెంటిమెంట్‌...జనసేనకు టీడీపీ వెన్నుపోటు పొడిచిందా ?

Veldandi Saikiran
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికల హడావిడి... ఇంకా కొనసాగుతూనే ఉంది. జూన్ 4వ తేదీన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉన్న నేపథ్యంలో... ప్రతి ఒక్కరూ  ఈ ఫలితాలపై ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు ఎప్పుడు ఈ ఫలితాలు వస్తాయి.. ఎప్పుడు పండగ చేసుకుందాం అని... పక్కగా గెలిచే అభ్యర్థులు అనుకుంటున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో పోలవరం నియోజకవర్గం గురించి ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది.


 ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం పోలవరం నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి ఒక బలమైన సెంటిమెంట్ ఉన్న సంగతి తెలిసిందే. పోలవరం నియోజకవర్గంలో గెలిచిన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. ఇదే ఆనవాయితీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతోంది. దీనికి తగ్గట్టుగానే 2014 సంవత్సరంలో... తెలుగుదేశం అభ్యర్థి శ్రీనివాసరావు విజయం సాధించడంతో... ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు.

 
 2019 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి పార్టీ తరఫున తెల్లం బాలరాజు విజయం సాధించారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారు. అయితే ఈసారి పోలవరం నియోజకవర్గంలో... తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పెట్టలేదు. ఆ స్థానాన్ని జనసేన పార్టీకి అప్పగించింది కూటమి. దీంతో ఈసారి వైసీపీ పార్టీ తరఫున తెల్లం రాజ్యలక్ష్మి పోటీ చేస్తున్నారు.  చిర్రి బాలరాజు జనసేన పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.

 
 అయితే సెంటిమెంట్ ప్రకారం పోలవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలిస్తే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి. అయితే ఆ సెంటిమెంట్ ను రిపీట్ కాకుండా తెలుగు తమ్ముళ్లు విశ్వ  ప్రయత్నాలు చేస్తున్నారట. ఎలాగైనా పోలవరం నియోజకవర్గంలో జనసేన గ్లాస్ ను పగలగొట్టేందుకు... తెలుగు తమ్ముళ్లు కుట్రలు చేశారంట. వైసిపి గెలిచేలా... తెలుగు తమ్ముళ్లు పనిచేశారట. అంతేకాదు  వాస్తవానికి టిడిపికి రావాల్సిన టికెట్ను.. జనసేనకు రావడంతో... అక్కడ ఉన్న తెలుగు తమ్ముళ్లు  అసంతృప్తిలో  ఉన్నారట. అందుకే... అక్కడ జనసేనకు వ్యతిరేకంగా కొంతమంది తెలుగు తమ్ముళ్లు పని చేశారని సమాచారం. ఈ గ్యాప్‌ లో వైసీపీ పార్టీ బలంగా ప్రచారం చేసి..ఓట్లు రాలేలా చేసుకుందట. అందుకే ఇప్పుడు విజయంపై ధీమాగా ఉంది వైసీపీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: