టెన్షన్ కి గురైన కురువృద్దులు.. చివరి కోరిక తీరుతుందా..?

lakhmi saranya
రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో కొందరు కురువృద్ధులు పోటీ చేశారు. బ్రతిమాలో.. బామా  లో మొత్తానికి 80 ఏళ్ల పైబడిన వారు రంగంలో ఉన్నారు. ఇదే క్రమంలో తమ వారసలను కూడా రంగంలోకి‌ దింపిన వారు కూడా ఉన్నారు. వీరంతా ఒక్కటే ఆశ పెట్టుకున్నా.. చివరి కోరిక తీర్చుకోవాలి.  మరి ఈ ఎన్నికల్లో ఓటరు దేవుడు. వీరిని కరుణించారా? అనేది సస్పెన్స్. ఇక ఈ జాబితాలో తొలి పేరు కనిపించేది.. టిడిపి వృద్ద నాయకుడు.. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి. ఈయన పరిస్థితిని గమనిస్తే.. పాపం అని అనిపిస్తుంది. చివరి నిమిషం వరకు టెన్షన్ పెట్టి టికెట్ ఖరారు చేశారు.

కందుల దుర్గేష్ ఎక్కడ తన సీటు కొట్టుకుపోతాడో అని బెంగ పెట్టేసుకుని తెల్లవారుజామున మూడు గంటలకే వాక్ చేసిన ఫోటోలు అప్పట్లో బుచ్చయ్య టెన్షన్ను బయట పెట్టాయి. ఇక చివరకు టికెట్ దక్కించుకున్న.. ఇప్పుడు గెలుస్తానో లేదో అన్న బెంగతో రోజు.. తన మిత్రులకు ఫోన్ చేసి ఏంటి సంగతి అని ప్రశ్నిస్తున్నాడట. ఇక వైసిపి విషయానికి వస్తే.. తాడిపత్రి నియోజకవర్గం నుంచి పెద్దిరెడ్డి బరిలో ఉన్నారు. ఆయన కూడా ఇదే చివరి ఎన్నిక అని ప్రచారం చేస్తున్నారు. వయసు 58 ఏళ్లు. దీంతో ఇదే తనకు చివరి ఎన్నికలని ప్రకటించుకున్నారు. దీంతో తాడిపత్రిలో చెలరేగిపోయారని వాదన కూడా ఉంది.

ఇక ఇక్కడ నుంచి బరిలో ఉన్న యువ నాయకుడు.. జేసీల వారసుడు అస్మిత్ రెడ్డి గలుపు కోసం తండ్రి జేసి ప్రభాకర్ రెడ్డి దిగులు పెట్టుకున్నారు. ఆయన వయసు 75 ఏళ్లు. మరి వీరిలో ఎవరి కోరిక నెరవేరుతుందో చూడాలి. ఇక గంగాధర ‌ నెల్లూరు నియోజకవర్గ నుంచి తన గారాల పట్టి నీ బరిలో నిలిపిన కిళత్తూరు‌ నారాయణస్వామి వయసు 62 ఏళ్లు. ఆయన ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించి కూతురు కోసం పనిచేస్తున్నారు. ఈయన కూడా నిత్యం తన వారిని ‌ ఏంటి విషయం అంటున్నారట. ఇక కీలక నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే ఒకసారి మాత్రమే ఆయన ప్రకటించిన.. గెలుపు కోసం ప్రయత్నించారు. కొణతాల రామకృష్ణ, గంట శ్రీనివాసరావు లు.. వయసు ఉన్నప్పటికీ.. రిటైర్మెంట్ ప్రకటించారు. మరి వారి పరిస్థితి ఏంటి? అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: