అతను జట్టులో లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది : గవాస్కర్

praveen
ఇటీవల ఆసియా కప్లో భాగంగా సూపర్ 4 లో అడుగుపెట్టింది టీమిండియా. సూపర్ 4 లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో మరోసారి మ్యాచ్ ఆడింది అన్న విషయం తెలిసిందే.ఎంతో రసవత్తరంగా జరిగిన ఈ మ్యాచ్లో చివరికి పాకిస్తాన్ జట్టు విజయం సాధించింది. ఈ క్రమంలోనే ఆసియా కప్లో భాగంగా మొదటి మ్యాచ్లో భారత్ చేతిలో ఓటమి పాలైన పాకిస్థాన్ అందుకు ప్రతీకారం తీర్చుకుంది అని చెప్పాలి. ముఖ్యంగా భారత బ్యాట్స్మెన్ల వైఫల్యం కారణంగానే పాకిస్తాన్ జట్టు విజయం సాధించగలిగింది అని చెప్పాలి..


 అంతకు ముందు జరిగిన మ్యాచ్ లో భారీగా పరుగులు చేసి  రెచ్చి పోయిన భారత బ్యాట్స్మెన్లు సూపర్ 4 లో భాగంగా జరిగిన మ్యాచ్ లో మాత్రం పెద్దగా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయారు. పేలవమైన ఫామ్ లో ఉన్నాడు అనుకున్న కోహ్లీ మాత్రమే 60 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. అదే సమయంలో జట్టులో    మార్పులు కూడా చేసింది టీమిండియా  యాజమాన్యం. ముఖ్యంగా అద్భుతమైన ఫామ్లో కొనసాగుతూ అదిరిపోయే ఫినిషర్ గా పేరు సంపాదించుకున్న దినేష్ కార్తీక్ ను పక్కన పెట్టింది అని చెప్పాలి.


 దినేష్ కార్తీక్ ని తీసుకోక పోవడం వల్ల జట్టు ఓటమి పాలు అయింది అన్న విమర్శలు  కూడా వస్తున్నాయి. ఇటీవల ఇదే విషయం పై స్పందించిన టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో దినేష్ కార్తీక్ ను జట్టులోకి తీసుకోక పోవడం ఆశ్చర్యానికి గురి చేసింది అంటూ చెప్పుకొచ్చాడు. అసలు అతన్ని ఎందుకు పక్కన పెట్టారు అన్నది ఆలోచించడం కష్టంగా ఉంది. ఇప్పటికే అతని ఆట తీరుతో జట్టులో ఫినిషర్ అని గుర్తించారు. అలాంటి ఆటగాడికి జట్టులో చోటు లేక పోవడం నిజంగా లోటే అంటూ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: