అతని స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేదు : మహమ్మద్ రిజ్వాన్

praveen
ఇటీవలే ఆసియా కప్ లో భాగంగా అద్భుతమైన ప్రదర్శన చేసి జట్టుకు విజయాన్ని అందించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టుకు ఆరంభంలోనే ఊహించని షాక్ తగిలింది అన్న విషయం తెలిసిందే. పాకిస్థాన్ జట్టులో కీలక బౌలర్ గా కొనసాగుతున్న షాహీన్ అఫ్రిది గాయం కారణంగా చివరికి జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే ఇక పాకిస్థాన్ బౌలింగ్ విభాగం కాస్త బలహీనపడింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  అయితే ప్రస్తుతం జట్టులో ఉన్న బౌలర్లు ప్రత్యర్థులపై తమ టాకింగ్ గేమ్ కొనసాగిస్తున్నప్పటికీ షాహీన్ అఫ్రిది లేని లోటు మాత్రం పాకిస్థాన్ జట్టులో స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్పాలి.

 ఇకపోతే అటు ఆసియా కప్లో చూసుకుంటే సూపర్ 4 లో అడుగుపెట్టిన పాకిస్థాన్ జట్టు ఇటీవలే భారత్ తో తలపడింది. ఆసియా కప్ లో భాగంగా మొదటి మ్యాచ్ లో  భారత్ పాకిస్తాన్ పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది అన్న విషయం తెలిసింది. ఇప్పుడు దీనికి ప్రతీకారం తీర్చుకుంది పాకిస్తాన్ జట్టు. ఇటీవల సూపర్ 4లో భాగంగా జరిగిన మ్యాచ్లో ఐదు వికెట్ల తేడాతో భారత్ పై విజయం సాధించడం గమనార్హం. అయితే ఇటీవలే జట్టులో కీలక బౌలర్ గా కొనసాగుతున్న మహమ్మద్ రిజ్వాన్ ఆఫ్ సెంచరీ చేసి జట్టును ఆదుకున్నాడు.

 ఇకపోతే గాయం కారణంగా జట్టుకు దూరమైన షాహీన్ అఫ్రిది గురించి  మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు మహమ్మద్ రిజ్వాన్. షాహీన్ అఫ్రిది స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని అంటూ చెప్పుకొచ్చాడు.  ప్రస్తుతం పాకిస్థాన్ పేస్ స్థలంలోనే ఒక బౌలర్ కూడా అతని మరిపించలేరని  చెప్పుకొచ్చాడు. కాగా శ్రీలంక  తో జరిగిన మ్యాచ్ లో షాహీన్ అఫ్రిది    గాయం బారిన పడ్డాడు అన్న విషయం తెలిసిందే. దీంతో నాసిమ్ షా, దాహని పాకిస్తాన్ పేస్ బౌలింగ్ బాధ్యతలు చేపట్టారు. అతని స్థానాన్ని భర్తీ చేసే బౌలర్ లేకపోయినప్పటికీ మాకు మరో షాహీన్ లభించే అవకాశం ఉంది. పాకిస్తాన్ బౌలర్లు నాసిమ్ షా, దాహని బాగా రాణించారు అంటూ మహమ్మద్ రిజ్వాన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: