మెగాస్టార్ చిరంజీవితో అనిల్ రాగిపూడి మనశంకర వరప్రసాద్ గారు సినిమా చేసిన సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద దాదాపు 350 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.ఇప్పటికి ఈ సినిమా థియేటర్లలో మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో తాజాగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని గ్రాండ్ గా అరేంజ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ సక్సెస్ మీట్ లో చిరంజీవి,వెంకటేష్,అనిల్ రావిపూడి, నిర్మాతలు ఇలా సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. అయితే మనశంకర వరప్రసాద్ గారు సక్సెస్ మీట్ లో అందరికంటే ఎక్కువగా అనిల్ రావిపూడి తండ్రి స్టేజ్ మీద మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. అంతేకాదు అనిల్ రావిపూడి కి చిరంజీవి విషయంలో తండ్రి వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. మరి ఇంతకీ అనిల్ రావిపూడి తండ్రి సక్సెస్ మీట్ లో ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం..
అనిల్ రావిపూడి తండ్రి మన శంకర వరప్రసాద్ గారు సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ.. నా కొడుకు బీటెక్ థర్డ్ ఇయర్ చదివే సమయంలో మూడు సబ్జెక్టులలో ఫెయిల్ అయ్యాడు. ఆ సమయంలో వాడి ఫ్రెండ్ తో కలిసి వారానికి మూడు సినిమాలు చూసేవాడు. అవి కూడా చిరంజీవి గారివే. ఆ టైంలో ఒక రోజు నేను వాడి దగ్గరికి వెళ్లి ఒరేయ్ నువ్వు చిరంజీవి గారి సినిమాలు వారానికి మూడు చూస్తున్నావు. సినిమాలు చూసి చూసి చిరంజీవి గారికి చెడ్డపేరు తేకు. ఎందుకంటే చిరంజీవి సినిమాలు చూసి చెడిపోయాడు అంటారు అని చెప్పాను. అయితే అప్పుడు చెప్పిన ఆ మాటను వాడు సీరియస్గా తీసుకొని బాగా చదివి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. ఆ తర్వాత ఇప్పుడు చిరంజీవి గారి సినిమాకి డైరెక్షన్ చేసే అవకాశం వచ్చింది.ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం. అసలు చిరంజీవి గారి సినిమా చూడడం కోసం టికెట్లు తెచ్చుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడే వాళ్ళం. అలాంటిది చిరంజీవి గారిని ఇంత దగ్గరగా చూస్తామని అనుకోలేదు.
చిరంజీవి గారి సినిమాకి నా కొడుకు డైరెక్షన్ చేస్తాడని అనుకోలేదు. ఇదంతా మా అదృష్టం అంటూ చాలా ఎమోషనల్ గా మాట్లాడారు అనిల్ రావిపూడి తండ్రి.అంతేకాకుండా ఈ సినిమా షూటింగ్ సమయంలో అనిల్ రావిపూడి తండ్రి ఓ సారి షూటింగ్ సెట్ కి వెళ్లిన టైం లో చిరంజీవి గారు ఆయన్ని తనతో పాటు భోజనానికి తీసుకువెళ్లి ప్రేమగా భోజనం తినిపించారట. ఈ విషయాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. అలాగే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని,400 నుండి 500 కోట్లు కొల్లగొడుతుందని అనిల్ రావిపూడి తండ్రి ఆ రోజే చెప్పారట. మీరెలా ఈ సినిమా హిట్ అవుతుందని చెప్పగలరని చిరంజీవి ప్రశ్నించగా కచ్చితంగా సినిమా హిట్ అవుతుంది. మీ స్టైల్,మీ క్రాఫ్, మీ డ్రెస్, మీ బాడీ లాంగ్వేజ్ ని చూస్తే కచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అంటూ చాలా నమ్మకంగా చెప్పారట. ఈ విషయాలన్నీ అనిల్ రావిపూడి తండ్రి మన శంకర వరప్రసాద్ గారు సినిమా సక్సెస్ మీట్ లో పంచుకున్నారు.