మారుతి కష్టం పగోడికి కూడా వద్దు.. క్యాష్ ఆన్ డెలివరీ పెట్టి ఇంటికి అలాంటి ఆర్డర్స్..!
ఈ సినిమాపై వచ్చిన విమర్శల నేపథ్యంలో ప్రభాస్ చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి. “రాజాసాబ్ సినిమా ఎవరినీ డిజప్పాయింట్ చేయదు. ఎవరికైనా అలా అనిపిస్తే నేను ఉండేది కొండాపూర్‌లోనే, అక్కడికి వచ్చి చెప్పొచ్చు” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వైరల్ అయ్యాయి.ఇక సినిమా ఫ్లాప్ టాక్ వచ్చినప్పటి నుంచి దర్శకుడు మారుతీ నివాసం వద్ద ప్రభాస్ అభిమానులు తిరుగుతున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా, ఈ వ్యవహారం మరింత విచిత్రమైన మలుపు తీసుకుంది. మారుతీ ఇంటి అడ్రస్‌కు పెద్ద ఎత్తున ఫుడ్ డెలివరీ ఆర్డర్స్ పెట్టినట్లు సమాచారం. ఒక శనివారం రోజే స్విగ్గీ, జొమాటో వంటి యాప్‌ల ద్వారా వందకు పైగా ఆర్డర్స్ వచ్చాయని తెలుస్తోంది.
అంతేకాదు, కొందరు అభిమానులు కావాలనే మెడికల్ పరికరాలు కూడా ఆర్డర్ చేసినట్లు సమాచారం. ఈ అనూహ్య పరిణామాలతో డెలివరీ బాయ్స్, సెక్యూరిటీ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని టాక్. ఈ ఘటన ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.ఈ మొత్తం వ్యవహారంపై దర్శకుడు మారుతీ కూడా స్పందించారు. “ఆ ఆర్డర్స్‌కు నాకు ఎలాంటి సంబంధం లేదు. కొందరు కావాలని ఇలా చేస్తున్నారు. డెలివరీ సంస్థలు ఈ విషయాన్ని గమనించి తగిన చర్యలు తీసుకోవాలి” అంటూ ఆయన స్పష్టంగా తెలియజేశారు.సినిమా ఫలితం ఎలా ఉన్నా, వ్యక్తిగతంగా ఇలాంటి చర్యలు సరైనవి కావని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలోనూ విస్తృతంగా చర్చకు వస్తోంది.