అతన్ని ఓపెనర్ గా పంపితే బాగుంటుంది : సంగక్కర

praveen
గత కొంతకాలం నుంచి ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ జోస్ బట్లర్ ఎంత అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొన్నటికి మొన్న ఐపీఎల్లో సెంచరీల మీద సెంచరీలు కొట్టి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ప్రతి మ్యాచ్లో కూడా అద్భుతమైన ప్రదర్శన చేసి బౌలర్లు అందరికీ కూడా సింహస్వప్నంగా మారిపోయాడు జోస్ బట్లర్. ఈ క్రమంలోనే ఏకంగా మూడు సెంచరీలు చేసి మొత్తంగా ఇక ఐపీఎల్ సీజన్ లోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించాడు అని చెప్పాలీ.

 ఈ క్రమంలో జోస్ బట్లర్ బ్యాటింగ్ పై ఎంతో మంది ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఐపీఎల్ ముగిసిన తర్వాత కూడా అదే ఫామ్ లో కొనసాగుతూ జోస్ బట్లర్ అదరగొడుతున్నాడు అనే చెప్పాలి. ప్రస్తుతం ఇంగ్లాండ్ నెదర్లాండ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో కూడా భారీగా పరుగులు చేస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే.. అయితే ఐపీఎల్లో లాగే అతనికి ఓపెనర్గా కాకుండా ఆరు ఏడు స్థానాలలో అవకాశం లభిస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఇదే విషయంపై మాట్లాడినా శ్రీలంక మాజీ క్రికెటర్ రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ కుమార సంగక్కర ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 జోస్ బట్లర్ ను టెస్టుల్లో ఆరు ఏడు స్థానాలలో కాకుండా ఓపెనర్ గా బరిలోకి దింపితే బాగుంటుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇలా జోస్ బట్లర్ ను ఓపెనర్ గా పంపిస్తే వీరేంద్ర సెహ్వాగ్ లాగా అద్భుతంగా రాణించే అవకాశం ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. వీరేంద్ర సెహ్వాగ్ను కూడా మొదట లోయర్ ఆర్డర్ లో పంపారని అప్పుడు సరైన బ్యాటింగ్ చేయలేకపోయాడని కానీ ఆ తర్వాత ఓపెనర్ గా  అవకాశం వచ్చిన తర్వాత మాత్రం అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన తో ఆకట్టుకున్నాడు అంటూ కుమార సంగక్కర గుర్తు చేస్తున్నాడు. ఇక ఇప్పుడు బట్లర్ ని కూడా అదేరీతిలో ఓపెనర్గా పంపితే బాగుంటుంది అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: