ఘోర పరాజయం.. షాక్ ఇచ్చిన పాక్?
ఈ గెలుపుతో మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0 తేడాతో ఆధిక్యాన్ని సాధించింది పాకిస్తాన్ జట్టు. అయితే గతంలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వాయిదా పడిన సిరీస్ను ఇప్పుడు ఆడేందుకు వెస్టిండీస్ జట్టు పాకిస్థాన్లో పర్యటించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఇటీవల జూన్ 8వ తేదీన ముల్తాన్ వేదికగా పాకిస్తాన్ విండీస్ జట్ల మధ్య మొదటి వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో భాగంగా టాస్ గెలిచింది వెస్టిండీస్ జట్టు. ఈ క్రమంలోనే మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 305 పరుగులు చేయగలిగింది వెస్టిండీస్. ఓపెనర్ షాయి హోప్ 127 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచి రాణించాడు.
అయితే నెదర్లాండ్ పర్యటనలో తీవ్రంగా నిరాశపరిచిన నికోలస్ పూరన్ మరోసారి పాకిస్థాన్ పర్యటనలో కూడా విఫలం అయ్యాడు అని చెప్పాలి. కేవలం 21 పరుగులు మాత్రమే చేసిన నికోలస్ పూరన్ వికెట్ చేజార్చుకున్నాడు. ఈ క్రమంలోనే విండీస్ తమ ముందు ఉంచిన 306 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టు ఆదిలోనే చేదు అనుభవం ఎదురైంది. ఫాఖార్ జమాన్ 11 పరుగులకే ఏడు వికెట్ కోల్పోయాడు. ఇక మరో ఓపెనర్ ఇమామ్ 65 పరుగులు చేసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. ఇదే సమయంలో వన్ డౌన్ లో వచ్చిన బాబర్ 103 పరుగులు చేసి పాకిస్తాన్ జట్టుకు విజయ బాటలు వేశాడు అని చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ 59 పరుగులతో ఆకట్టుకునీ అదరగొట్టేశాడు. దీంతో పాకిస్థాన్ విజయం సాధించింది..