నా కెరీర్ ముగిసిపోయింది అనుకున్నా : పాక్ క్రికెటర్

praveen
పాకిస్తాన్ జట్టు తరఫున స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్న టెస్టు జట్టు ఓపెనర్ అబిద్ అలీ గత ఏడాది తీవ్రమైన గుండె పోటుకు గురయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే అభిమానులు అందరూ కూడా ఎంతగానో ఆందోళన లో మునిగి పోయారు. ఈ క్రమం లోనే వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా యాంజియో ప్లాస్టీ నిర్వహించి రెండు స్టంట్ లను వైద్యులు అమర్చడం గమనార్హం. ఇక ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు అన్న విషయం తెలుస్తోంది.

 ఇకపోతే ఇటీవలే పాకిస్తాన్ క్రికెట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో అబిద్ అలీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ క్రమం లోనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇక తన ఆరోగ్యం బాగా లేనప్పుడు తనకు మద్దతుగా నిలిచి ధైర్యం చెప్పిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజాకు.. ధైర్యం చెప్పిన  వైద్యులకు కూడా కృతజ్ఞతలు తెలుపు తున్నాను అంటూ అబిద్ అలీ చెప్పుకొచ్చాడు. గత ఐదు ఆరు నెలల నుంచి ఆరోగ్య పరంగా ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తన ఆరోగ్యం ఎంతో బాగుంది అంటూ తెలిపాడు.

 మళ్లీ ఇలాంటి సాధారణ స్థితికి వస్తానని కలలో కూడా ఊహించ లేదు అంటూ చెప్పుకొచ్చాడు. తీవ్ర మైన గుండె పోటు రావడం ఇక అటు వివిధ రకాల ఆరోగ్య సమస్యల కారణం గా క్రికెట్ కెరియర్ ముగిసి పోతుంది అది భావించాను. ఈ క్రమం లోనే శక్తిమంతుడైన ఆ దేవుడికి ధన్యవాదాలు చెబుతున్నా.. నేను మళ్ళీ తిరిగి కోలుకోవడానికి సహాయపడిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తో పాటు నా కోసం దేవుని ప్రార్థించిన అభిమానులకు కూడా ధన్యవాదాలు చెబుతున్నాను. అంతేకాదు ఇన్నాళ్ల పాటు నాకు మద్దతుగా నిలిచిన సహచర ఆటగాళ్లకు కూడా ధన్యవాదాలు చెబుతున్నాను అంటూ అబిద్ అలీ చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: