ఐపీఎల్ : ఈ ఏడాది 5 వికెట్ల హాల్ సాధించిన ప్లేయర్లు వీళ్లే?

praveen
టి20 ఫార్మాట్ అనగానే ప్రేక్షకులకు గుర్తొచ్చేది. బ్యాట్స్మెన్లు దంచికొట్టే సిక్సర్లే. కేవలం టీ-20 ఫార్మెట్లో బ్యాట్స్ మెన్ లదే ఆధిపత్యం కొనసాగుతోంది అని విశ్లేషకులు కూడా చెబుతుంటారు. క్రీజు లోకి వచ్చిన బ్యాట్స్మెన్ సిక్సర్లు ఫోర్లతో చెలరేగి పోవడమే అనే టార్గెట్ తోనే బరిలోకి దిగుతు ఉంటాడు అని చెప్పాలి. నిజంగానే టి20 మ్యాచ్ ఎక్కడ ఏ జట్ల మధ్య జరిగిన బ్యాట్స్మెన్లు  ఇలాంటి విధ్వంసం సృష్టించడం చూస్తూనే ఉంటామూ అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా బౌలర్లపై వీర విహారం చేస్తూ బౌండరీలతో విరుచుకుపడుతున్న బ్యాట్స్మెన్లను కట్టడి చేయడం అటు బౌలర్లకు సవాల్తో కూడుకున్న పని అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే తమలో దాగివున్న ప్రతిభను వెలికి తీసి బ్యాట్స్మెన్ లను తక్కువ పరుగులకే కట్టడి చేయడమే కాదు ఏకంగా వికెట్లు పడగొట్టడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు కొంతమంది బౌలర్లు. ఇక ఇలా ఒకవైపు బ్యాట్స్మెన్ లు విజృంభిస్తుంటే బౌలర్లు ఒకటి రెండు వికెట్లు తీసుకోవడమే  గొప్ప అని అంటూ ఉంటారు. అలాంటిది కొంత మంది బౌలర్లు మాత్రం ఒకే మ్యాచ్లో ఏకంగా 5 వికెట్లు సాధించి సత్తా చాటుతూ ఉంటారు. కీలకమైన సమయంలో వికెట్లు పడగొట్టడమే కాదు ఇక జట్టును విజయతీరాలకు వైపు నడిపిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల 2022 ఐపీఎల్ సీజన్ ముగిసిన నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్ లో 5 వికెట్లు హాల్ సాధించిన బౌలర్  ఎవరు అనే విషయం చర్చకు వచ్చింది.

 ఆ వివరాలేంటో తెలుసుకుందాం.. జస్ప్రిత్ బూమ్రా ముంబై ఇండియన్స్ తరఫున కోల్కతా నైట్రైడర్స్ పై జరిగిన మ్యాచ్లో నాలుగు ఓవర్లలో 10 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. హసరంగా ఆర్సిబి తరుపున సన్రైజర్స్ పై నాలుగు ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. ఉమ్రాన్ మాలిక్ సన్ రైజర్స్ తరఫున గుజరాత్ టైటాన్స్ పై 4 ఓవర్లలో 25 పరుగులకే 5 వికెట్లు తీసుకున్నాడు. పర్పుల్ క్యాప్ వీరుడు చాహల్ రాజస్థాన్ తరఫున కోల్కతాపై 40 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీసుకోవడం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: