టీ-20 ఫార్మెట్లో.. రబడా అరుదైన రికార్డు?

praveen
కగిసో రబాడా.. ఈ పేరు వింటే చాలు బ్యాట్ మెన్స్  వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు అద్భుతమైన బౌలింగ్తో వికెట్లు పడగొడుతూ ఉంటాడు కాబట్టి.  అందుకే కగిసో రబాడా బౌలింగ్ చేస్తున్నాడు అంటే చాలు ఎంతో ఆచితూచి ఆడుతూ వికెట్ కాపాడు కుంటూ ఉంటారు బ్యాట్స్మెన్లు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ఉన్న అత్యుత్తమ బౌలర్లలో రబడా కూడా ఒకరు అనే విషయం తెలిసిందే. కాగా ఐపీఎల్ ద్వారా అటు భారత క్రికెట్ ప్రేక్షకులకి కూడా ఎంతో దగ్గరయ్యాడు. ప్రస్తుతం ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో పంజాబ్ క్రికెట్ జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.

 ఇకపోతే ఇటీవల పంజాబ్ కింగ్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో రబాడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఒక వైపు పరుగులు కట్టడి చేయడమే కాదు కీలకమైన సమయంలో వికెట్లు కూడా తీశాడు. ఈ క్రమంలోనే టీ-20 క్రికెట్ లో ఒక అరుదైన మైలురాయిని అందుకున్నాడు కగిసో రబాడా. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తో జరిగిన మ్యాచ్ లో హర్షల్ పటేల్ ను అవుట్ చేయడం ద్వారా టి20 ఫార్మాట్ లో 200 వికెట్లు తీసిన ఆటగాడిగా అరుదైన మైలురాయిని చేరుకున్నాడు కగిసో రబాడా. అంతేకాదు టీ20 ఫార్మాట్ లో అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన మూడో ప్లేయర్ గా నిలిచాడు. ఏకంగా 146 మ్యాచ్ లలో రెండు వందల వికెట్ల మార్కును అందుకున్నాడు కాగిసొ రబడా.

 ఇక ఈ లిస్ట్ లో రబాడా కంటే ముందు రషీద్ ఖాన్ 134 మ్యాచ్ లోని రెండు వందల వికెట్స్ మార్కును అందుకుని తొలి స్థానంలో కొనసాగుతూ ఉండటం గమనార్హం. పాకిస్తాన్ విన్నర్ సాహిద్ 139 మ్యాచ్ లలో 2 వందల వికెట్లు అందుకున్నాడు. ఇక ఉమర్ గుల్ 147 మ్యాచ్ లతో నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాడు. లసిత్ మలింగ 149 మ్యాచ్ లతో ఐదో స్థానంలో కొనసాగుతుండటం గమనార్హం. ఇక ఈ మ్యాచ్లో  155 పరుగులకే బెంగళూరు జట్టు ఆలౌట్ కాగా భారీ విజయాన్ని అందుకుంది పంజాబ్ కింగ్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: