హార్దిక్ లోటును అతను భర్తీ చేస్తున్నాడు : ఆకాష్ చొప్రా

praveen
ఎన్నో రోజులనుంచి టీమిండియాలో స్టార్ ఆల్ రౌండర్గా కొనసాగుతూ వచ్చాడు హార్దిక్ పాండ్యా. ఓవైపు బౌలింగ్లో మరోవైపు బ్యాటింగ్లో కూడా అద్భుతంగా రాణించి టీమిండియా విజయంలో కీలక పాత్ర వహించాడు అనే చెప్పాలి. ఇక హార్దిక్ పాండ్యా క్రీజులో ఉన్నాడు అంటే ఇండియా అభిమానులందరి లో మ్యాచ్ గెలుస్తుంది అని ఒక భరోసా ఉండేది. అంతలా తన బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు హార్దిక్ పాండ్యా. ఇలాఎన్నో రోజుల పాటు టీమిండియాలో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగిన హార్దిక్ పాండ్యా ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడ్డాడు.

 దీంతో టీమిండియా జట్టు నుంచి హార్దిక్ పాండ్యా చోటును కోల్పోయాడు అన్న విషయం తెలిసిందే. అయితే హార్దిక్ పాండ్యా స్థానాన్ని ఎవరు భర్తీ చేయ గలరు అని ఆలోచిస్తున్న సమయంలో నేనున్నాను అంటూ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ తెర మీదికి వచ్చాడు. కేవలం ఒక ఫార్మాట్ లో కాదు మూడు ఫార్మాట్లలో కూడా అదరగొడుతున్నాడు. ఇటీవలే శార్దూల్ ఠాకూర్ పై ప్రశంసలు కురిపించాడు మాజీ ఆటగాడు ఆకాష్ చొప్రా. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో శార్దూల్ ఠాకూర్ ఏడు వికెట్లతో చెలరేగాడు. దీంతో అతని కెరీర్లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేయడమే కాదు మరోవైపు బ్యాటింగ్ లో కూడా 28 పరుగులు సాధించి ఆకట్టుకున్నాడు.

 ఈ క్రమంలోనే స్పందించిన ఆకాశ్ చోప్రా శార్దూల్ ఠాకూర్ రెండో టెస్టులో చేసిన ప్రదర్శన అద్భుతం ఏడు వికెట్లు తీయడమే కాదు బ్యాటింగ్లో 24 బంతుల్లో 28 పరుగులు సాధించాడు. అయితే ఈ పరుగులు తక్కువే అయినా ఆ తర్వాత ఆ పరుగులు ఎంత విలువైనవో తెలుస్తుంది. ఎందుకంటే దక్షిణాఫ్రికా విజయానికి 122 పరుగులు కావాలి ఒకవేళ శార్దూల్ ఠాకూర్ ఆ పరుగులు చెయ్యకపోయి ఉంటే దక్షిణాఫ్రికా లక్ష్యం మరింత తక్కువగా ఉండేది. అయితే హార్దిక్ పాండ్యా తో పోల్చి చూస్తే శార్దూల్ ఠాకూర్ బ్యాటింగ్లో కాస్త వెనుకబడి ఉన్నాడు. కానీ బౌలింగ్ లో మాత్రం అంతకంటే ఎంతో మెరుగ్గా కనిపిస్తున్నాడు అంటూ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: