నిత్యం కొనే వస్తువుల పై... మనం వాటి బ్రాండ్ మరియు మార్కెట్ లో దాని రేటింగ్ బట్టి కొనుక్కుంటాం. అలాగే మరికొందరేమో... ఆ వస్తువు యొక్క బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అని
తెలుసుకొని మరీ కొనుగోలు చేస్తారు. ఉదాహరణకు బూస్ట్, బైక్స్, కార్లు ఇలాగే అనేక రకాల వస్తువులను కొనేటప్పుడు... వాటి రేటింగ్ తో పాటు బ్రాండ్ అంబాసిడర్ ఎవరో తెలుసుకొని కొంటాం. అందులోనూ మన ఫేవరెట్ క్రికెటర్ లేదా యాక్టర్ ఎవరు ఉన్నారో చూసి కూడా కొంటాం.
ఇలా చాలా మంది క్రికెటర్లు మరియు సినిమా స్టార్లు అనేక కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. ఇప్పుడు ఆ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా పశ్చిమ బెంగాల్ లో ఒక విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు ఈ ఘటన సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే... బీడీ ప్యాకెట్ పై ఫుట్ బాల్ స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సి ఫోటో కలకలం రేపింది. పశ్చిమబెంగాల్లోని జూలియన్ అనే నగరంలో ఆరిఫ్ బీడీ ఫ్యాక్టరీ లో ఈ బీడీ ప్యాకెట్లను తయారు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన ఫోటోలను ఓ ఐఏఎస్ అధికారి... తన సోషల్ మీడియాలో పెట్టారు.
అక్కడితో ఆగకుండా... మెస్సి ఫస్ట్ ఎన్ డోర్స్ మెంట్ ఇన్ ఇండియా అనే క్యాప్షన్ కూడా ఆ పోస్టర్ కు జత చేశాడు. దీంతో ఆ ఫోటోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ పోస్టర్ను చూసిన నెటిజన్లు తమకు నచ్చిన కామెంట్లు పెడుతూ... ఎంజాయ్ చేస్తున్నారు. మరికొందరు.. వాళ్ళ ఫోటోలు పెడితే బాగా సెలింగ్ అవుతున్నట్లు ఉన్నాయి అని కామెంట్స్ పెడుతున్నారు. ఇదిలా ఉండగా మెస్సి ఫోటో తో ఉన్న బీడీ ప్యాకెట్ మాత్రమే కాదు... ఫోర్స్ గ్రీస్ దేశానికి చెందిన ఆ ఫుట్ బాల్ ప్లేయర్ క్రిస్టియానో రోనాల్డో బీడి ప్యాకెట్ల ఫోటోలు కూడా వైరల్ కావడం గమనార్హం.