క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్ ఎన్నో గొప్ప గొప్ప రికార్డులను సాధించింది. కానీ వెస్టిండీస్ క్రికెట్ జట్టు ప్రస్తుతం మాత్రం ఆ స్థాయి ఫలితాలను అందుకోవడంలో చాలా వెనకబడిపోయింది. వెస్టిండీస్ జట్టు చాలా సంవత్సరాల క్రితం ఏకంగా వరుసగా రెండు సార్లు వరల్డ్ కప్ ను గెలుచుకుంది. ఆ సమయం లో వెస్టిండీస్ జట్టు చాలా జట్ల తో పోలిస్తే అత్యంత ముందు స్థానంలో కొనసాగింది. ఇక ప్రస్తుతం మాత్రం వెస్టిండీస్ జట్టు అత్యంత పేలావమైన ప్రదర్శనను కనబరుస్తోంది. ఇకపోతే వెస్టిండీస్ క్రికెట్ జట్టు పేలావమైన ప్రదర్శనను కనబరుస్తున్నా కూడా వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఆటగాడు అయినటువంటి రస్సెల్ మాత్రం అద్భుతమైన ఆట తీరుతో ముందుకు సాగిపోతున్నాడు. ఇప్పటి వరకు రస్సెల్ ఎన్నో మ్యాచ్ లను ఆడాడు. అద్భుతమైన ఆట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తన జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. ఆల్రౌండర్ గా ఎన్నో మ్యాచులలో అద్భుతమైన స్కోర్ చేసి , అలాగే అద్భుతమైన బౌలింగ్ తో తన జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించాడు. ఇకపోతే ఒక విషయంలో చరిత్ర లోనే ఒకే ఒక్కడిగా రస్సెల్ నిలిచాడు. మరి ఏ విషయం లో ఈయన గొప్ప గొప్ప రికార్డులను సాధించాడు అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.
విండీస్ ఆల్‌రౌండర్ అయినటువంటి రస్సెల్ చరిత్ర సృష్టించారు. t20 లో 5000 ప్లస్ రన్స్, 500 ప్లస్ సిక్సులు , 500 ప్లస్ వికెట్లు సాధించిన తొలి ప్లేయర్‌గా ఈ ఆటగాడు ఘనత సాధించాడు. అన్ని దేశాల లీగ్‌లలో కలిపి ఈ ఆటగాడు 576 మ్యాచ్‌లు ఆడారు. మొత్తంగా రస్సెల్ 9,496 రన్స్ , 972 సిక్స్లు , 628 ఫోర్లు చేసాడు. కాగా వ్యక్తి గతంగా 126 మంది 5000 ప్లస్ రన్స్ , ఆరుగురు 500 ప్లస్ వికెట్లు , 10 మంది 500 ప్లస్ సిక్సర్లు రస్సెల్ సాధించాడు.