సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది నటీ మణులకు వరుస పెట్టి భారీ ఆపజయాలు వస్తున్నా కూడా స్టార్ హీరోల సినిమాలలో క్రేజీలలో అవకాశాలు వస్తూ ఉంటాయి. కానీ మరి కొంత మంది కి మాత్రమే నటించిన ఒక్క సినిమాతో కూడా మంచి విజయం దక్కకపోయినా వరుస పెట్టి క్రేజీ సినిమాలలో అవకాశాలు దక్కుతూ ఉంటాయి. అలా నటించిన ఒక్క సినిమాతో కూడా మంచి విజయం అందుకోకపోయినా వరుస పెట్టి స్టార్ హీరోల సినిమాలలో క్రేజీ సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటున్న బ్యూటీలలో మనుషి చిల్లర్ ఒకరు. ఈమె మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకొని ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అక్షయ్ కుమార్ హీరో గా రూపొందిన సామ్రాట్ పృథ్వీరాజ్ అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయింది. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా మిగిలింది. కానీ ఈ సినిమా ద్వారా ఈమెకు నటిగా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈమె ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ అనే సినిమాలో నటించింది.
ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయింది. ఈ సినిమా తర్వాత ఈమె బడే మీయన్ చోటే మీయాన్ అనే సినిమాలలో నటించింది. ఈ సినిమా కూడా బాక్సా ఫీస్ దగ్గర ప్లాప్ అయ్యింది. ఇకపోతే ఈమె కొంత కాలం క్రితం టాలీవుడ్ నటుడు వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా బాక్సా ఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఇలా ఈ బ్యూటీ నటించిన నాలుగు సినిమాల్లో నాలుగు మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయినా కూడా ఈమెకు వరుస పెట్టి అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న బాలీవుడ్ సినిమాలలో అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది.