కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ రజనీ కాంత్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రజినీ కాంత్ ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని ఇండియా వ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే రజనీ కాంత్ చాలా సంవత్సరాల క్రితం నరసింహ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో సౌందర్య , రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ కాస్త నెగిటివ్ షెడ్స్ ఉన్న పాత్రలో నటించింది. ఈ సినిమాలో రమ్యకృష్ణ తన అందాలతో , నటనతో రెండింటితో కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దానితో ఈ సినిమా ద్వారా ఈమెకి అద్భుతమైన గుర్తింపు వచ్చింది. ఇకపోతే మొదట నరసింహ సినిమాలో రమ్యకృష్ణ పాత్రకు ఆమెను కాకుండా మరో స్టార్ హీరోయిన్ను అనుకున్నారట. అందులో భాగంగా ఆమెను సంప్రదించారట. కానీ ఒకే ఒక్క కారణంతో ఆ స్టార్ హీరోయిన్ ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట.
ఇంతకు నరసింహ సినిమాలో రమ్యకృష్ణ పాత్రను రిజక్ట్ చేసిన నటి ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు ... మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటి మణులలో ఒకరు అయినటువంటి ఐశ్వర్య రాయి. మొదట నరసింహ మూవీ యూనిట్ రమ్యకృష్ణ పాత్ర కోసం ఐశ్వర్య రాయ్ ని అనుకొని ఆమెను వెళ్లి సంప్రదించి ఆ మూవీ కథను , ఆమె పాత్రకు సంబంధించిన కథను పూర్తిగా వివరించారట. కథ మొత్తం అద్భుతంగా నచ్చిన కూడా రమ్యకృష్ణ పాత్రకు సంబంధించిన లక్షణాలు నచ్చకపోవడంతో ఐశ్వర్య రాయ్ ఆ సినిమాలో నటించను అని చెప్పిందట. దానితో ఆ మూవీ లో రమ్యకృష్ణ ను ఆ తర్వాత ఎంపిక చేసుకున్నారట. అలా ఐశ్వర్య రాయ్ రిజక్ట్ చేసిన పాత్రలో రమ్య కృష్ణ నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నట్లు తెలుస్తోంది.