టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును కెరియర్ స్టార్టింగ్ లోనే సంపాదించుకున్న వారిలో కమలిని ముఖర్జీ ఒకరు. ఈమె తన కెరీర్లో ఎక్కువ శాతం శేఖర్ కమ్ముల దర్శకత్వం లో రూపొందిన సినిమాల్లో హీరోయిన్గా నటించింది. ఈమె చాలా సంవత్సరాల క్రితం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఆనంద్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ లో రాజా హీరోగా నటించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం , ఇందులో కమిలిని ముఖర్జీ తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా ద్వారా ఈ నటికి తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈమెకు శేఖర్ కమ్ముల దర్శకత్వం లో సుమంత్ హీరో గా రూపొందిన గోదావరి సినిమా ద్వారా కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలా కెరియర్ ప్రారంభంలోనే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన రెండు సినిమాల ద్వారా మంచి విజయాలను , మంచి గుర్తింపులను అందించుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత కూడా మంచి దశ లోనే కెరియర్ను ముందుకు సాగించింది.
ఇకపోతే ఈమె తెలుగు లో చాలా సంవత్సరాల క్రితం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా కృష్ణ వంశీ దర్శకత్వం లో రూపొందిన గోవిందుడు అందరివాడేలే అనే సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో నటించింది. ఈ మూవీ బాక్సా ఫీస్ దగ్గర పెద్ద విజయం అందుకోకపోయినా ఈ మూవీ ద్వారా ఈమె మంచి గుర్తింపు ను సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత ఈమె తెలుగు లో పెద్దగా సినిమాలు చేయలేదు. అలాగే ఈమె ఇతర భాషల్లో కూడా వరుస పెట్టి సినిమాలు చేయడం లేదు. తాజాగా ఈ నటికి సంబంధించిన ఓ ఫోటో వైరల్ అవుతుంది. ఆ ఫోటోలో ఆమె స్టార్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసుకొని రేంజ్ లో గార్జియస్ లుక్ లో ఉంది. దానితో చాలా మంది కమిలిని ముఖర్జీ అనవసరంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. ఈమె సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే వరుస పెట్టి అవకాశాలను దక్కించుకుంటుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.