ఎంగేజ్మెంట్ పిక్స్ డిలీట్ చేసిన టాలీవుడ్ హీరోయిన్.. బ్రేకప్ ..?
నివేదా దుబాయ్ కి చెందిన బిజినెస్ మ్యాన్ రాజ్ హిత్ ఇబ్రాన్ ను వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతుందనుకున్న సమయంలో తాజాగా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుంచి ఎంగేజ్మెంట్ ఫోటోలను డిలీట్ చేసింది. అంతేకాకుండా వీరిద్దరూ ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. దీంతో వీరిద్దరి ఎంగేజ్మెంట్ రద్దు అయిపోయిందనే వార్తలు ఇండస్ట్రీలో గుసగుసలుగా వినిపిస్తున్నాయి.
ఈ మధ్య సెలబ్రిటీల విషయంలో ఇలాంటి బ్రేకప్ విషయాలు కొత్తేమీ కాదు. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు ఇలాంటి బాట పట్టారు. కానీ నివేదా పేతురాజు ఫరెవర్ అని చెప్పి బంధాన్ని ఇంత త్వరగా ముగించడం ఆమె అభిమానులకు నిరాశ కలిగించింది. వివాహం అనంతరం సినిమాలు చేయదనుకున్న సమయంలో బ్రేకప్ వార్తలతో మళ్లీ వార్తలలో నిలిచింది ఈ ముద్దుగుమ్మ. దీంతో ఇప్పుడు తిరిగి మళ్లీ సినిమాల వైపే దృష్టి పెట్టే అవకాశం ఉన్నట్లు వినిపిస్తున్నాయి. మరి ఈ బ్రేకప్ వార్తలపై నివేదా కాని, రాజ్ హిత్ కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జరిగిన ఈ పరిస్థితులు మాత్రమే వీరిద్దరు విడిపోయారని వార్తలకు బీజం వేసింది. మరి ఈ విషయంపై సరైన స్పష్టత ఇస్తారేమో చూడాలి మరి.