తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి మనులలో రేణు దేశాయ్ ఒకరు. ఈమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన బద్రి అనే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించడం , ఇందులో రేణు దేశాయ్ తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ ద్వారా ఈమెకి మంచి గుర్తింపు తెలుగు పరిశ్రమలో వచ్చింది. ఈ మూవీ తర్వాత ఈమె ఎన్నో తెలుగు సినిమాలలో నటించి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. ఇకపోతే ఈమె బద్రి సినిమాతో కాకుండా మరో స్టార్ హీరో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వాల్సిందట. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా మిస్ అయ్యిందట.
ఇంతకు ఏ హీరో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి రేణు దేశాయ్ ఎంట్రీ ఇవ్వాల్సిందో తెలుసా ..? ఆయన మరెవరో కాదు ... టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ కొన్ని సంవత్సరాల క్రితం నిన్ను చూడాలని అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో మొదటగా హీరోయిన్ పాత్రకు రేణు దేశాయ్ ని అనుకున్నారట. అందులో భాగంగా ఆమెను సంప్రదించారట. కానీ ఆ సమయం లో ఆమెకు తెలుగు పై అంతగా పట్టు లేకపోవడంతో ఆ సమయం లో ఆ సినిమా చేయలేక పోయిందట. ఆ తర్వాత పూరి జగన్నాథ్ "బద్రి" సినిమా కోసం ఆమెను సంప్రదించగా , ఆమె బద్రి సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అలా ఈమె జూనియర్ ఎన్టీఆర్ హీరో గా రూపొందిన నిన్ను చూడాలి అనే సినిమా ద్వారా కాకుండా బద్రి అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తుంది.