
బెన్ స్టోక్స్ కి ఎమోషనల్ వీడ్కోలు.. వైరల్ వీడియో..?
ఇకపోతే ఐపీఎల్ లో భాగంగా అన్ని జట్లు ప్రస్తుతం అద్భుతంగా రాణిస్తూ ఉన్నాయి అనే చెప్పాలి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ జట్టు భారీ స్కోరు చేస్తూ ఉండడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే ఇటీవలే కొత్త కెప్టెన్ సంజు శాంసన్ సారథ్యంలో ఎంతో దూకుడుగా ముందుకు సాగుతున్న రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో రాజస్థాన్ రాయల్స్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఎడమ చేతి చూపుడు వేలికి గాయమైంది.
అయితే గాయం నుంచి కోలుకుని మళ్లీ జట్టులోకి బెన్ స్టోక్స్ వస్తారు అని అందరూ అనుకున్నారు. కానీ గాయం తీవ్రం కావడంతో ఇక శస్త్రచికిత్స అవసరమని వైద్య నిపుణులు తెలిపారు. దీంతో బెన్ స్టోక్ శస్త్ర చికిత్స కోసం స్వదేశానికి బయలుదేరాడు. ఐపీఎల్ 2021 సీజన్ లో తన జర్నీ ఒక్క మ్యాచ్ తోనే ముగించాడు. ఈ క్రమంలోనే రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం స్ట్రోక్స్ కి ఘనంగా వీడ్కోలు పలికింది. అతని తండ్రి జెడ్ స్ట్రోక్స్ పేరుమీద రాజస్థాన్ రాయల్స్ ఒక జెర్సీ తయారుచేసి బెన్ స్టోక్స్ కి ఇచ్చింది. అంతేకాదు ప్రతి ఒక ఆటగాడు బెన్ స్టోక్ తో ఉన్న తన అనుబంధాన్ని పంచుకున్నారు.