రెండో మ్యాచ్ లో కోహ్లీ ఎన్ని పరుగులు చేస్తాడో.. ముందే చెప్పేసాడు..?

praveen
భారత జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టుతో  వరుసగా సిరీస్ లు  ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా టీమిండియా మొదటి మ్యాచ్ ఆడింది. అయితే మొన్నటి వరకు ఆస్ట్రేలియా విజయం తర్వాత టీమిండియా అద్భుతంగా రాణిస్తుంది అనుకున్నప్పటికీ.. టీమ్ ఇండియా మొదటి మ్యాచ్ లోనే  ఘోర పరాభవాన్ని చవి  చూడటంతో టీమిండియా అభిమానులందరూ నిరాశలో మునిగి పోయారు.  ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా పర్యటనలో లాగానే  టీమిండియా రెండవ మ్యాచ్ లో  పుంజుకుంటుంది అని ప్రస్తుతం ఎంతో ధీమాతో ఉన్నారు అందరూ.

 ఇక పోతే ఇక జట్టు రెండవ టెస్ట్ మ్యాచ్లో ఎవరు ఎలా రాణించ బోతున్నారు అనేదానిపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు  తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక రెండవ మ్యాచ్ లో  విరాట్ కోహ్లీ ఎలా రాణించబోతున్నారు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది. మొదటి టెస్టు మ్యాచ్లో టీమ్ ఇండియా కు విజయం అందించేందుకు విరాట్ కోహ్లీ ఎంతగానో పోరాడినప్పటికీ.. చివరికి ఫలితం లేకుండా పోయింది అనే విషయం.

 77 పరుగులతో విరాట్ కోహ్లీ బాగా రాణించాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రెండవ టెస్ట్ మ్యాచ్లో కూడా విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణిస్తాడు అని ప్రస్తుతం అందరూ అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా రెండవ టెస్ట్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ రెచ్చిపోతాడు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. కోహ్లీ సెంచరీ చేసి ఏకంగా 400 రోజులు అయిపోతుంది అంటూ  ఆశిష్ నెహ్రా చేసిన వ్యాఖ్యలు కాస్త ఆసక్తికరంగా మారిపోయాయి . రెండవ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఒకవేళ విరాట్ కోహ్లీ తప్పకుండా 250 పరుగులు చేసి అద్భుతంగా రాణిస్తాడు అంటూ ఆశిష్ నెహ్ర అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: