కట్టప్పా.. సమరశంఖం పూరించు.. ప్రేక్షకుల ఉత్సాహం.. వీడియో వైరల్..?

praveen
మరికొన్ని గంటల్లో ఐపీఎల్ సీజన్ ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. క్రికెట్ ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ క్షణం మరికొన్ని గంటల్లో కళ్ళముందు తేలియాడబోతుంది. ఇక ప్రారంభం పోరులో టైటిల్ ఫేవరెట్ అయిన చెన్నై సూపర్ కింగ్స్... ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్  జరుగబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్షణాల కోసం భారత క్రికెట్ జట్టు సభ్యులందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈరోజు సాయంత్రం ఏడున్నర గంటలకు ఐపీఎల్ మొదటి మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం కరోనా  వైరస్ ప్రభావం దృశ్య క్రికెట్ ప్రేక్షకులు  స్టేడియం లోకి వెళ్ళే అవకాశం లేని నేపథ్యంలో ప్రస్తుతం అందరూ టీవీల ముందు కాచుకుని  వేచి చూస్తున్నారు.

 గత ఆరు నెలల నుంచి క్రికెట్ ఎంటర్టైన్మెంట్ కి పూర్తిగా దూరమైన ఫ్యాన్స్ అందరూ ఐపీఎల్ మొదటి మ్యాచ్ ప్రారంభ క్షణాల కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ సంబరాలను కూడా మొదలుపెట్టారు. ఏ జట్టు గెలుస్తుంది అనేదానిపై ఎవరికి వారు అంచనాలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఆయా జట్లకు సోషల్ మీడియా వేదికగా ఆల్ ద బెస్ట్ కూడా చెబుతున్నారు క్రికెట్ అభిమానులు. ఇలాంటి క్రమంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారిపోయింది.


 ఈ వీడియో సోషల్ మీడియాలో అందరినీ కడుపుబ్బ నవ్వించడమే  కాదు... ఐపీఎల్ టోర్నీ  కోసం క్రికెట్ ప్రేక్షకులందరూ ఎంత నిరీక్షణ గా ఎదురుచూస్తున్నారు అనే విషయాన్ని కూడా తెలిపింది. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాహుబలి సినిమాలో... కట్టప్ప సమర శంఖం పూరించారు అంటూ రమ్యకృష్ణ చెబుతున్న ఆ డైలాగ్ ను మార్ఫింగ్ చేసిన క్రికెట్ ప్రేక్షకులు... సమర శంఖం కి బదులు ఐపీఎల్ మ్యూజిక్ యాడ్ చేసి అందరిలో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు. ప్రస్తుతం ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: