రెండో వన్డేలో “భారత్” ఘన విజయం..

Bhavannarayana Nch

దక్షిణాఫ్రికా గడ్డపై వన్డే సీరీస్ లో భారత జట్టు వరుస విజయాలతో దూసుకువెళ్తోంది...టెస్టు మ్యాచ్చుల్లో అభిమానులని నిరాశపరిచినా వన్డేలలో మాత్రం దుమ్మురేపెస్తోంది..ఈరోజు  సెంచూరియన్ లో జరిగిన రెండో వన్డేలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోహ్లీ..తన టీం తో బరిలోకి దిగాడు..భారత స్పిన్నర్స్ స్పిన్నర్లు చాహల్ (5/22), కుల్దీప్ యాదవ్ (3/20) ధాటికి తొలుత దక్షిణాఫ్రికా జట్టుని 118 పరుగులకే కుప్పకూల్చారు..

 

అయితే దక్షిణాఫ్రికా జట్టుకి ఓపెనర్లు హసీమ్ ఆమ్లా (23: 32 - 4x4)..డికాక్ (20: 36 -2x4) మెరుపు ఆరంభమిచ్చే ప్రయత్నం చేశారు..డికాక్ నెమ్మదిగా ఆడుతూ స్కోర్ నో పెంచడానికి చూస్తుంటే..ఆమ్లా మాత్రం తనదైన శైలిలో ఆడుతూ స్కోర్ పెంచేలా చేశాడు.. ఈ క్రమంలోనే ఇన్నింగ్స్ పదో ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఆమ్లా వికెట్ కీపర్ ధోనీ చేతికి చిక్కాడు..తరువాత డికాక్ కూడా పెవిలియన్ చేరిపోయాడు..ఇలా ఒకరి తరువాత మరొకరు మణికట్టు మాయాజాలానికి బలై పోయారు.. చాహల్, కుల్దీప్ ఇద్దరూ కలిసి రెండో వన్డేలో 8 వికెట్లు తీసి దక్షినాఫ్రికాకి చుక్కలు చూపించారు..

 

ఇదిలా ఉంటే దక్షిణాఫ్రికా 118 పరుగుల స్కోర్ ని భారత్ చాలా అలవోకగా చేదించింది...శిఖర్ ధావన్ (51 నాటౌట్: 56 బంతుల్లో 9x4)..విరాట్ కోహ్లి (46 నాటౌట్: 50 బంతుల్లో 4x4, 1x6) దూకుడుగా ఆడటంతో 20.3 ఓవర్లలోనే భారత్ విజయం అందుకుంది...అయితే ఈ విజయంతో ఆరు వన్డేల సిరీస్‌లో 2-0తో భారత్ ఆధిక్యంలో ఉంది...అంతేకాదు వన్డే ర్యాంకింగ్స్‌లో దక్షిణాఫ్రికా జట్టును వెనక్కి నెట్టి నెం.1 స్థానానికి వెళ్ళింది భారత్..అయితే మూడో వన్డే మాత్రం బుధవారం కేప్‌టౌన్ వేదికగా జరగనుంది..

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: