కారులో దీప్తి సునైన లేటెస్ట్ లుక్స్..!

Anilkumar
సోషల్ మీడియా ద్వారా ఎంతో మంచి గుర్తింపును తెచ్చుకున్న వారిలో దీప్తి సునయన ముందు వరుసలో ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. హీరోయిన్ లలా కాకుండా సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న వారిలో దీప్తి సునయన కూడా ఉంటుంది. అలా సోషల్ మీడియాతో మంచి గుర్తింపును తెచ్చుకున్న దీప్తి బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చి మరింత గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే బిగ్బాస్ 2 లో దీప్తి సునయన తన

 గ్లామర్ తో తనీష్ తో కలిసి ఆమె చేసిన రొమాన్స్ ఏ రేంజ్ లో ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇకపోతే  ప్రస్తుతం దీప్తి సునైనా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటుంది. అంతేకాదు ప్రస్తుతం ప్రైవేట్ సాంగ్స్ చేస్తూ కెరియర్లో ఫుల్ బిజీగా ఉంది. తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే విధంగా సోషల్ మీడియాలో తనకి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. గ్లామర్ పరంగా ఆకట్టుకోవడమే కాకుండా చాలా చలాకిగా ఉంటూ మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.

అయితే ఇటీవల దీప్తి సునైనా తన గ్లామర్ పై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. తరచూ సోషల్ మీడియాలో వాటికి సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తోంది. అందరిలాగా మరి విపరీతమైన ఎక్స్పోజింగ్ చేయకపోయినప్పటికీ తన గ్లామర్ తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ క్రమంలోనే తాజాగా దీప్తి సునైనా తనకి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలని సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంది .ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా దీప్తి సునైనా అందమైన చీర కట్టులో ఫోజులు ఇచ్చింది. ఇటీవల దీప్తి సునైనా లగ్జరీ కారు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఆయా కారుకి పూజ చేస్తూ దీప్తి సునైనా ఇలా ఫోజులు ఇచ్చింది. కారు డ్రైవ్ చేస్తూ, కారులో కూర్చుని దీప్తి సునైనా క్యూట్ గా ఫోజులు ఇచ్చింది. కళ్ళు చెదిరే సొగసుతో దీప్తి సునైనా ఇస్తున్న ఫోజులు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: