భీమిలి: గంటాను పోలింగ్ రోజు జ‌గ‌న్ గింగ‌రాలు కొట్టించాడుగా ?

Pulgam Srinivas
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా లో ఉన్న భీమిలి నియోజకవర్గం ఎప్పుడు స్పెషల్ గానే ఉంటూ వస్తుంది. ఇక్కడ గెలుపు కోసం ప్రధాన పార్టీలు ఎప్పుడు గట్టిగానే పోటీ పడుతూ ఉంటాయి. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదటి సారి జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికలలో భీమిలి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఘంటా శ్రీనివాసరావు గెలుపొందారు. 

ఆ తర్వాత 2019 వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మొత్తంశెట్టి శ్రీనివాసరావు భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇకపోతే 2014 వ సంవత్సరంలో టీడీపీ నుండి పోటీ చేసి గెలుపొందిన గంటా శ్రీనివాసరావు 2024 వ సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ పార్టీ నుండి సీటును దక్కించుకున్నాడు.

ఇక 2019 వ సంవత్సరం వైసీపీ పార్టీ నుండి భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం దక్కించుకున్న గంట శ్రీనివాసరావు కే వైసీపీ పార్టీ మరోసారి భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశాన్ని కల్పించింది. ఇక ఇప్పటికే వీరిద్దరూ ఈ ప్రాంతంలో గెలిచి ఉండడంతో మొదటి నుండి గట్టిపోతే వీరి ఇద్దరి మధ్య ఉంటుంది అని చాలా మంది భావించారు.

కాకపోతే ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే భీమిలి నియోజకవర్గం లో టీడీపీ అభ్యర్థి అయినటువంటి గంటా శ్రీనివాసరావు పెద్ద స్థాయిలో ముత్తంశెట్టి శ్రీనివాస్ కు పోటీ ఇవ్వలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భీమిలి నియోజకవర్గం లో చాలా శాతం ఓటింగ్ పూర్తి అయ్యింది. ఎండాకాలం కావడం, భారీగా ఎండలు ఉండడంతో దాదాపు జనాలు అంతా ఉదయాన్నే తమ ఓటు హక్కును ఎక్కువ శాతం వినియోగించుకున్నారు.

దానితో ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్ శాతాన్ని బట్టి చూస్తే గంటా శ్రీనివాసరావు కి వైసీపీ పార్టీ అధినేత అయినటువంటి జగన్ పోలింగ్ రోజే గింగిరాలు కొట్టించినట్లుగా అక్కడి ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. ఇక ఇప్పటివరకు జరిగిన పరిస్థితులను బట్టి చూస్తే భీమిలి నియోజకవర్గ సీట్ ను వైసీపీ క్యాండిడేట్ అయినటువంటి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గెలుచుకునే అవకాశాలే క్లియర్ కట్ గా కనబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: