ముంబై పరిస్థితి ఎలా ఉన్నా.. బుమ్రా అది సాధించాడు?
అయితే ఆ జట్టు మళ్ళీ పూర్వవైభవాన్ని పొందేందుకు ఇక ఐదు సార్లు టైటిల్ అందించిన కెప్టెన్ రోహిత్ శర్మను సైతం పక్కన పెట్టేసింది జట్టు యాజమాన్యం. హార్దిక్ పాండ్యాకు సారధ్య బాధ్యతలను అప్పగించింది అయినప్పటికీ ముంబై ఇండియన్స్ కి మాత్రం ఎక్కడ అదృష్టం కలిసి రాలేదు అని చెప్పాలి. హార్దిక్ కెప్టెన్సీలో మరింత దారుణంగా విఫలమైంది జట్టు అయితే ముంబై ఇండియన్స్ ఇలా వరుస ఓటములతో సతమతమవుతున్నప్పటికీ ఆ జట్టు బౌలర్ బుమ్రా మాత్రం తన ప్రదర్శనతో ఆకట్టుకుంటూనే ఉన్నాడు. ప్రతి మ్యాచ్ లో కూడా తన వంతు పాత్ర పోషిస్తూ జట్టును గెలిపించేందుకు తీవ్రంగానే శ్రమించాడు. ఈ క్రమంలోనే జట్టు ఓడిపోతున్న బుమ్రా మాత్రం రికార్డులు సృష్టిస్తూనే ఉన్నాడు.
ఇప్పటికే తన ప్రదర్శనతో పలు రికార్డులను కొల్లగొట్టిన బుమ్రా.. ఇక ఇటీవల ఐపీఎల్లో మరో రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. అత్యధిక సీజన్లలో 20 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన భారత పాస్ట్ బౌలర్గా బుమ్రా రికార్డు నెలకొల్పాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 20 వికెట్లు పడగొట్టిన ఈ ముంబై స్టార్ బౌలర్.. 2017లో 20, 2020 లో 27, 2021 లో 21 వికెట్లు తీసాడు అయితే స్పిన్నర్లలో ఐదుసార్లు ఇలా 20 వికెట్లు పడగొట్టిన బౌలర్గా టాప్ లో కొనసాగుతూ ఉన్నాడు చాహల్ అని చెప్పాలి. అయితే ముంబై ఇండియన్స్ లో ఉన్న గ్రూపు రాజకీయాల కారణంగానే ఆ జట్టు దారుణంగా విఫలమవుతుంది అంటూ విమర్శలు కూడా వస్తున్నాయి అని చెప్పాలి