అలాంటి వాళ్ల నోర్లు మూయించిన శిరీష్..అల్లు వారి అబ్బాయి అదుర్స్ అంతే..!

Thota Jaya Madhuri
మెగా కుటుంబానికి చెందిన హీరో అల్లు శిరీష్ వివాహం ఇటీవల అట్టహాసంగా జరిగింది. ఆయన నయనిక రెడ్డితో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, సన్నిహితులు హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పెళ్లి వేడుకలో జరిగిన ఎన్నో ప్రత్యేక క్షణాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే వాటిలో ముఖ్యంగా చర్చకు దారితీసింది శిరీష్ ధరించిన ఆభరణాలు. ముఖ్యంగా ఆయన మెడలో ధరించిన ఖరీదైన “చోకర్” నెక్లెస్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

పెళ్లి వేడుకలో సంప్రదాయ దుస్తులతో పాటు ప్రత్యేకంగా డిజైన్ చేసిన నగలను ధరించిన శిరీష్ లుక్ కొందరికి ఆకట్టుకోగా, మరికొందరు మాత్రం దీనిపై మీమ్స్ మరియు ట్రోల్స్ చేయడం ప్రారంభించారు. “మగవాడు ఇలా చోకర్ ధరించడమేంటి?” అంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు చేయగా, మరికొందరు సరదాగా మీమ్స్ కూడా తయారు చేశారు. ఈ మీమ్స్ వైరల్ అవడంతో ఈ విషయం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కారణమైంది.ఈ వివాదంపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పందించిన అల్లు శిరీష్ తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించారు. తన మెడలో ధరించిన చోకర్‌పై వచ్చిన ట్రోల్స్ గురించి మాట్లాడుతూ ఆయన సమాజంలో ఉన్న లింగ వివక్షలపై గట్టిగా స్పందించారు. “మగవారు నగలు ధరించకూడదు అనే ఆలోచన అసలు మన భారతీయ సంప్రదాయంలో నుంచి వచ్చినది కాదు. ఇది ఎక్కువగా పాశ్చాత్య సంస్కృతి ప్రభావం వల్ల మనలో ఏర్పడిన భావన” అని ఆయన తెలిపారు.

మన దేశ చరిత్రను ఒకసారి పరిశీలిస్తే పురాతన కాలంలో భారతీయ రాజులు, మహారాజులు, మొఘల్ చక్రవర్తులు ఎంతో విలువైన ఆభరణాలు ధరించేవారని ఆయన గుర్తు చేశారు. పెద్ద పెద్ద హారాలు, ముత్యాల గొలుసులు, చోకర్లు వంటి నగలను వారు గర్వంగా ధరించేవారని, అప్పుడు ఎవరూ దాన్ని విచిత్రంగా చూడలేదని చెప్పారు. “మన సంప్రదాయాల్లో పురుషులు నగలు ధరించడం చాలా సహజమైన విషయం. కానీ కాలక్రమేణా పాశ్చాత్య ఆలోచనల ప్రభావంతో మగవారు ఇలా ఉండాలి, ఆలా ఉండాలి అనే పరిమితులు మనపై మోపబడ్డాయి” అని శిరీష్ వ్యాఖ్యానించారు.ఇంకా ఆయన మాట్లాడుతూ, “మనము ఇప్పుడు 2026 సంవత్సరంలో ఉన్నాము. సమాజం ఎంతో మారిపోయింది. అయినప్పటికీ ఇంకా పాతకాలం నాటి కట్టుబాట్లలోనే జీవించడం అవసరమా? ఒక వ్యక్తి తనకు నచ్చినట్టు దుస్తులు ధరించడం లేదా స్టైల్‌ను ఎంచుకోవడం పూర్తిగా వ్యక్తిగత స్వేచ్ఛ. దానిపై ఇతరులు వ్యాఖ్యానించడం సరైనది కాదు” అని అన్నారు.

తన స్టైల్ గురించి కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. “నేను ఏది ధరించాలి, ఎలా కనిపించాలి, నా మేనరిజం ఎలా ఉండాలి అన్నది నాకు తెలుసు. ఇతరులు చెప్పినట్టు జీవించాల్సిన అవసరం నాకు లేదు. నాకు నచ్చినట్టు నేను ఉంటాను. నా వ్యక్తిత్వాన్ని నేను స్వయంగా నిర్ణయించుకుంటాను. ఎవరైనా వచ్చి ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పే హక్కు ఎవరికీ లేదు” అంటూ ఆయన ధైర్యంగా స్పందించారు.శిరీష్ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో మరోసారి చర్చకు దారితీశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: