GOAT: రిలీజ్ కి ముందే భారీ లాభాలు?

Purushottham Vinay
తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ GOAT. భారీ బడ్జెట్ తో ఈ మూవీని AG ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.ఏకంగా 300 కోట్ల దాకా ఈ సినిమా కోసం ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీ కావడంతో ఈ మూవీపై తమిళనాట విపరీతమైన క్రేజ్ ఉంది. యువన్ శంకర్ రాజా ఈ GOAT చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రీసెంట్ గా ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేయగా ఆ సాంగ్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది కానీ ఆశించిన స్థాయిలో బజ్ క్రియేట్ చేయలేదు. మరోవైపు  విజయ్ తమిళ రాజకీయాలలో బిజీ అయ్యేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే పార్టీ పేరు కూడా ఎనౌన్స్ చేశారు. పైగా రాజకీయాలలోకి వెళ్లిన తర్వాత సినిమాలు చేయరు.పూర్తిగా వదిలేస్తానని విజయ్ చెప్పారు. GOAT మూవీ తర్వాత మరొక్క సినిమా మాత్రమే చేస్తానని విజయ్ క్లారిటీ ఇచ్చారు. అందువల్ల ప్రస్తుతం చేస్తోన్న GOAT మూవీపైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాపై బిజినెస్ జరుగుతోంది.


ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ రైట్స్ అన్ని భాషలకి కలిపి 150 కోట్ల వరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఇప్పుడు మూవీ శాటిలైట్ రైట్స్ బిజినెస్ కూడా షాక్ ఇచ్చేలా ఉందని తెలుస్తుంది. డిజిటల్ ఎంటటైన్మెంట్ వచ్చిన తర్వాత టెలివిజన్ ప్రీమియర్ లకి ఆదరణ బాగా తగ్గింది. దీంతో శాటిలైట్ రైట్స్ కోసం టీవీ ఛానల్స్ ఎక్కువ డబ్బులు పెట్టడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నాయి. అయితే GOAT మూవీ శాటిలైట్ రైట్స్ ని జీ నెట్ వర్క్ ఏకంగా 90 కోట్లకి కొనుగోలు చేసిందని తెలుస్తుంది. జీ నెట్ వర్క్ ఈ మధ్యకాలంలో శాటిలైట్ రైట్స్ కోసం అత్యధిక పెట్టుబడి పెట్టిన సినిమా GOAT అని సమాచారం తెలుస్తోంది. అన్ని భాషలకి సంబందించిన హక్కుల కోసం ఈ డబ్బు చెల్లించడానికి జీ నెట్ వర్క్ రెడీ అయ్యిందట. ఈ లెక్కలు చూసుకుంటే 240 కోట్ల దాకా నాన్ థీయాట్రికల్ రైట్స్ ద్వారా ఈ మూవీ సంపాదించింది. ఇక థియేటర్స్ లో 150 కోట్ల దాకా వ్యాపారం జరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మొత్తానికి నిర్మాతలు టేబుల్ ప్రాఫిట్ తోనే GOAT మూవీని రిలీజ్ చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: