వరుణ్ తేజ్ : బాబాయ్ ను లోపలికి పంపే బాధ్యత మీదే..!

FARMANULLA SHAIK
ఆంధ్రప్రదేశ్లో మరో  రెండు వారాల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అయితే కూటమి ప్రచారంలో భాగంగా ఇప్పటికే సినీ సెలబ్రిటీ హంగామా షురూ అయింది. దాంట్లో భాగంగానే పిఠాపురం నియోజకవర్గం లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం ఎన్నికల ప్రచారం చేయడానికి రంగం లోకి దిగారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.మెగా ప్రిన్స్ కొణిదల వరుణ్ తేజ్ రాజమండ్రి విమానాశ్రయానికి వచ్చిన వెంటనే అక్కడ అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో పాటు, ఆయన తల్లి, మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు సతీమణి పద్మ కూడా వచ్చారు. నాగబాబు వరుణ్ తేజ్ ను సాదరంగా స్వాగతించి అక్కడి నుండి రోడ్డు మార్గాన పిఠాపురం వెళ్లారు.పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం లో జనసేన అభ్యర్థి పవన్‌ కల్యాణ్‌ కు మద్దతుగా వరుణ్‌ తేజ్‌ గొల్లప్రోలు మండలం లోని పలు గ్రామాల్లో శనివారం రోడ్‌షో నిర్వహించారు.గాజు గ్లాసు గుర్తును చూపుతూ ఓట్లు అభ్యర్థించారు. తాటిపర్తి, కొడవలి, దుర్గాడ గ్రామా ల్లో జరిగిన సభల్లో ఆయన మాట్లాడారు. 'ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు అప్పుచేసి మరీ పవన్‌ సాయం అందించారు. పిఠాపురం ప్రజలను కుటుంబ సభ్యులుగా భావిస్తున్నారు.
నియోజకవర్గం లోని ప్రతి గ్రామాన్నీ అభివృద్ధి చేస్తారు. చిరంజీవి సహా మా కుటుంబం మొత్తం పవన్‌ బాబాయ్‌ వెనకే ఉంది. కూటమి అభ్యర్థులను గెలిపించాలి' అని పిలుపునిచ్చారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం తో బాబాయి రాజకీయాల్లోకి రావడం తమకు ఎంతో గర్వం గా ఉందని, ఈ ఎన్నికల్లో బాబాయ్ విజయం సాధించాలని పిఠాపురం గుడి లో అమ్మవారిని ప్రార్థించానని చెప్పారు. ఎలాంటి స్వార్థం లేకుండా రాజకీయాల్లో కష్టపడుతున్న తన బాబాయిని పిఠాపురం నియోజకవర్గ ప్రజలే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు కూడా ఆదరించాలని కోరుతున్నాను అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: