ఏపీ: బీజేపీ ఇరకాటంలో పడేసిన కాంగ్రెస్ అప్రమత్తమైన అధిష్టానం..??

Suma Kallamadi
భారతదేశంలో బీజేపీ, కాంగ్రెస్ జాతీయ పార్టీలు ఒకదానికొకటి ఎప్పుడూ పోట్లాడుకుంటూనే ఉంటాయి. పైకి మాత్రం కాంగ్రెస్ అసలు ప్రత్యర్థి కాదు అని బీజేపీ షో చేస్తుంది. కానీ వాస్తవానికి రాజకీయంగా ఒకదానిని మరొకటి కచ్చితంగా గుర్తిస్తుంది. కాంగ్రెస్‌ను ఒక బలమైన ప్రత్యర్థిగా బీజేపీ భావిస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రెండు పార్టీలను ప్రజలే గుర్తించడం లేదు. దీని ఫలితంగా ఈ పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్‌లో తమని తాము గుర్తుంచుకోవడం లేదు. అయితే షర్మిల రాకతో ఈ సిచువేషన్ మారినట్లు తెలుస్తోంది.
ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి వైఎస్ షర్మిల కృషి చేస్తున్నారు. బిజెపిని బదనాం చేస్తూ ప్రయోజనం పొందాలని కూడా చూస్తున్నారు.  ముఖ్యంగా అమిత్ షా మాట్లాడిన కొన్ని మాటలను ఆడియో క్లిప్పుల రూపంలో కట్ చేసి వాటిని ప్రచారంలోకి తీసుకొస్తున్నారు. ముస్లిం రిజర్వేషన్లతో పాటు టోటల్ రిజర్వేషన్స్ ఎత్తి వేస్తున్నారని అమిత్ షా చెప్పినట్లు ఆడియో క్లిప్పులను వైరల్ చేస్తున్నారు. దీనిపై బీజేపీ స్పందించింది ఒక కంప్లైంట్ కూడా ఇచ్చింది. మైనారిటీ రిజర్వేషన్స్ అని కేంద్ర హోం మంత్రి మాట్లాడితే వాటిని మార్ఫింగ్ చేసి, ఎస్సీ ఎస్టీలకు ఆపాదించారని బీజేపీ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసింది. అలాగే దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేసింది.
ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ రాజు కాంగ్రెస్ టీడీపీ గురించి తప్పుగా ప్రచారాలు చేస్తున్నట్టు ఫైర్ అయ్యారు. ఆయనే స్వయంగా రాష్ట్ర ఎన్నికల సంఘ అధికారికి ఫిర్యాదును అందించారు. బీజేపీ గురించి తప్పుగా, అసత్య ప్రచారాలు చేస్తున్న సోషల్ మీడియా కార్యకర్తల పై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని ఆయన కోరారు. ప్రస్తుతం ఈ వ్యవహారం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. ఇకపోతే మరికొద్ది వారాలలో ఏపీలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరగనున్నాయి. ఎన్నికలలో ఈ రెండు జాతీయ పార్టీలు కాకుండా వైసీపీ లేదా టీడీపీ రెండింటిలో ఏదో ఒకటి గెలుస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: