నా విధిని నిర్వర్తించాను... ఇక మీదే... రాజమౌళి..!

Pulgam Srinivas
ఓటు హక్కును వినియోగించుకోవడం అనేది ప్రతి భారతీయుడు యొక్క బాధ్యత. మనం ఓటు హక్కును వినియోగించుకోవడానికి కొంత కష్టం అయినా , డబ్బులు ఖర్చు అయిన అందుకోసం పెద్దగా వెనకాడకుండా మన ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఇక కొంత మంది ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి బద్దకిస్తూ ఉంటారు.

కానీ మరి కొంత మంది మాత్రం వృద్ధాప్యంలో నడవలేని స్థితిలో ఉండి కూడా ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే కొంత మంది అంగవైకల్యం కలిగిన వారు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. అలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని దేశం లోని ఓటు హక్కును కలిగిన ప్రతి పౌరుడు ఎలక్షన్ డే రోజు తన ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఇకపోతే సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత సెలబ్రిటీలు తాము ఓటు హక్కును వినియోగించుకున్న విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ద్వారా తెలియజేస్తున్నారు.

ఇలా మంచి స్థాయిలో ఉన్న వ్యక్తులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు అని తెలియడంతో మరి కొంత మంది సామాన్యులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇకపోతే ఈ రోజు దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం లో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి.

ఇక రాజమౌళి ఇన్ని రోజుల పాటు దుబాయి లో ఉన్నాడు. ఇక దుబాయ్ నుండి నేరుగా ఈయన తన భార్య రమతో కలిసి హైదరాబాదు లోని షేక్ పేట ఇంటర్నేషనల్ స్కూల్ లో ఉన్న పోలింగ్ బూత్ లో తన ఓటు ను వేశాడు. ఇక ఓటు వేసిన తర్వాత తాను తన భార్య నేను ఓటు వేసాము. మా బాధ్యతను నిర్వర్తించాము. మీరు కూడా ఓటు హక్కును వినియోగించుకుని మీ బాధ్యతను నిర్వర్తించండి అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: