మంగళగిరిలో ఓటేసిన పవన్ కళ్యాణ్.. లోకేష్ గెలుపు ఖాయమంటూ ధీమా?

praveen
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ ప్రక్రియ మొదలైంది   175 అసెంబ్లీ స్థానాలకు 25 ఎంపి స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఈ క్రమంలోనే ఎక్కడ చూసినా ఓటర్లందరూ కూడా ఓటు వేయడంలో బిజీబిజీగా ఉన్నారు. ఇన్నాళ్లు తమ గల్లీలో తిరిగి ప్రచారం చేసి హామీల వర్షం కురిపించిన అభ్యర్థుల భవితవ్యం ఏంటో తేల్చేందుకు రెడీ అయిపోయారు. ఈ క్రమంలోనే హామీలు కురిపించిన వారిని నమ్మారా లేకపోతే అభివృద్ధి చేస్తాడు అనుకున్న వారిని నమ్మారా అన్నది తేల్చేందుకు ఇక ఓటర్లు రెడీ అయిపోయారు.

 ఈ క్రమంలోనే సాధారణ ఓటర్లు మాత్రమే కాదు ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు అని చెప్పాలి   అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు   అక్కడ తనదే గెలుపు అనే ధీమాతో ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తన ఓటుని మంగళగిరిలో కలిగి ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే మంగళగిరిలో టిడిపి తరఫున పోటీ చేస్తున్న లోకేష్ ను గెలిపించుకోవడం కోసం పవన్ కళ్యాణ్ ఓటు వేసేందుకు రెడీ అయ్యారు.

 ఈ క్రమంలోనే ఇటీవలే మంగళగిరిలోని పోలింగ్ స్టేషన్ కు సతి సమేతంగా వచ్చిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే ఇక ఈ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కూటమి తప్పకుండా విజయం సాధిస్తుందని భారీ మెజారిటీ వస్తుందని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. ఇంకోవైపు జనసైనికులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గెలిపించేందుకు పిఠాపురంలో పోలింగ్ కేంద్రాలకు బారులు తీరుతున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇక జనసేనాని ఈసారి ఎమ్మెల్యే అయి అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయంగానే కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: