అల్లరి నరేష్ ను హీరోగా తీసుకోడానికి కారణం అదేనా ...?

murali krishna
అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత చేస్తున్న కామెడీ ఎంటర్ టైనర్ కావడంతో ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. మే 3న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానున్న నేపధ్యంలో నిర్మాత రాజీవ్ చిలక విలేకరులు సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. “ఈ కథను డైరెక్టర్ మల్లి అంకం చెప్పగానే నా మైండ్ లోకి వచ్చిన మొదటి హీరో రాజేంద్రప్రసాద్ గారు. ఆయన యంగ్ గా ఉంటే ఈ కు ఆయన పర్ఫెక్ట్. ఇక ఇప్పుడున్న హీరోలలో అయితే అల్లరి నరేష్ గారికే ఈ మూవీ సెట్ అవుతుంది. అలాగే ఈ కు టైటిల్ గురించి ఆలోచిస్తున్న సమయంలో అల్లరి నరేష్ ఆ ఒక్కటీ అడక్కు టైటిల్ సూచించారు. ఆయనను పెళ్లి ఎప్పుడని అడిగినప్పుడల్లా ఇదే ఆన్సర్ ఇచ్చేవారని” అన్నారు.పెళ్లి అనేది నేటి రోజుల్లో తన ఒక్కడికే సమస్య, తనకే పెళ్లి కావడం లేదనే ధోరణితో చాలా మంది మానసికంగా క్రుంగుబాటుకి గురౌతున్నారు. ఈ రోజుల్లో సెటిల్ అవ్వడం కంటే పెళ్లి అవ్వడం పెద్ద టాస్క్ గా మారింది. ఒకప్పుడు బంధవులు, చుట్టాలు చుట్టుపక్కల ఉంటూ వాళ్ళే పెళ్లి సంబధాలు చూసే వారు. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. ఒకొక్కరూ ఒకొక్క రాష్ట్రంలో, దేశంలో వుంటున్నారు. పెళ్లి కోసం వెబ్ సైట్స్ పై ఆధారపడుతున్నారు. మ్యాట్రీమొనీ సైట్స్ ద్వారానే లక్షల్లో పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. పైగా ఇందులో ఒకరిగురించి ఒకరికి తెలీయదు కూడా. జీవితానికి సంబధించిన పెద్ద నిర్ణయాన్ని ఇలా తీసుకుంటున్న పరిస్థితి వుంది. ఇది నేడు యువత ఎదుర్కొంటున్న సమస్య. అందరూ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్. ఈ కథ చాలా వినోదాత్మకంగా చెప్పాం. కామెడీ, డ్రామా, హ్యుమర్ , సాంగ్స్ ఇలా అన్నీ ఎలిమెంట్స్ అద్భుతంగా వచ్చాయి.విషయానికి వస్తే సబ్ రిజిస్టార్ గా తన చేతులపై ఎన్నో పెళ్లిళ్లు జరిపించిన అతడికి 35 ఏళ్లు వచ్చినా పెళ్లి కాదు. మరి తన వివాహం కోసం ఆ హీరో చేసిన ప్రయత్నాలేంటీ ? ఆ సమయంలో ఎలాంటి పరిస్థితులు వచ్చాయనేది వినోదాత్మకంగా చూపించామని అన్నారు రాజేష్ చిలకా. ఈ ఈతరం యువతకు బాగా కనెక్ట్ అయ్యే కథ అని ప్రేక్షకులను కట్టిపడేస్తుందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: