తారక్ లైనప్ వల్ల అయోమయంలో ఫ్యాన్స్.. ఈ టైంలో ఆ నిర్ణయం అవసరమా.

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో హీరోగా నటించాడు. తాజాగా తారక్ , కొరటాల శివ దర్శకత్వంలో దేవర పార్ట్ 1 అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది. జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ తోనే ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో నటించిన ఈ మూవీ కి అనురుధ్ రవిచంద్రన్ సంగీతం అందించాడు.

ఇకపోతే దేవర పార్ట్ 1 కి కొనసాగింది పార్ట్ 2 కూడా ఉండబోతుంది అని మేకర్స్ ప్రకటించారు. ఇకపోతే ఇప్పటికే వార్ 2 అనే సినిమాలో హీరోగా నటిస్తున్న తారక్ మరి కొంత కాలం లోనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి కూడా చాలా కాలమే అవుతుంది.

ఇక వార్ 2 సినిమా షూటింగ్ పూర్తి కాగానే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ మూవీ స్టార్ట్ చేస్తాడు అని , దానిని చాలా త్వరగా పూర్తి చేసి ఆ తర్వాత దేవర పార్ట్ 2 ను స్టార్ట్ చేస్తాడు అని ఆయన అభిమానులు అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఎన్టీఆర్ , నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అని ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త కనుక నిజం అయితే మరి దేవర పార్ట్ 2 ను ఎప్పుడు చేస్తాడు ..? అసలు చేస్తాడా ... లేదా అనే అనుమానాలు ఎన్టీఆర్ అభిమానుల్లో , సాధారణ సినిమా ప్రేక్షకుల్లో నెలకొన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: