"నరదిష్టి" పోవాలి అంటే భార్య చేత సింపుల్ గా ఇలా చేయించండి.. ఇక మీ ఫ్యామిలీకి ఆల్ హ్యాపీ డేస్..!
జాబ్ వచ్చిందని కుల్లుకునే వాళ్ళు కొందరు.. జాబ్ వచ్చాక ప్రమోషన్ వచ్చిందని కుల్లుకునే వాళ్ళు మరికొందరు ..పెళ్లయితే కొందరు పిల్లలు పుడితే కొందరు ..ఇలా రకరకాలుగా ప్రతి విషయంలోనూ నరదిష్టి ని ఎదుర్కొంటూ ఉంటారు జనాలు . మరీ ముఖ్యంగా కొంతమంది రోజురోజుకి సక్సెస్ అయిపోతున్న తరుణంలో మన చుట్టుపక్కల ఉండేవారు మనలో ఉండేవాళ్ళ కొంతమంది ఎక్కువగా దిష్టి పెడుతూ ఉంటారు . "అబ్బా వాళ్లకేమి" అనే మాట వస్తే మాత్రం కచ్చితంగా ఇక ఆ కుటుంబం పూర్తిగా డౌన్ ఫాల్ అయిపోవడానికి రెడీ అయిపోయినట్లే .
అంత ప్రమాదకరమైన ది నదిష్టి అంటున్నారు పండితులు . నరదిష్టి పోవడానికి చాలామంది మహిళలు ఇళ్లల్లో రకరకాలుగా తోచిన విధంగా పూజలు చేస్తూ ఉంటారు. అయితే పూజలు చేయకపోయినా ప్రాబ్లం లేదు కానీ మీకు నరదిష్టి పోవడానికి ఒకే ఒక్క పని మాత్రం ఖచ్చితంగా పాటించాలి అంటున్నారు పండితులు. మరీ ముఖ్యంగా శుక్రవారం - మంగళవారం - ఆదివారం ఖచ్చితంగా ఇంటి ఇల్లాలు నిమ్మకాయను పసుపులో అద్ది.. రెండుగా కోసి .. ఇంటి గుమ్మానికి రెండు పక్కాలా కుంకుమ అద్ది.. ఇంటి గుమ్మం ముందు అటు ఇటుగా పెడితే ఇంటికి ఎంత నరదిష్టి ఉన్న పోతుంది అని అంటున్నారు పండితులు.
నరదిష్టి పోవడానికి రకరకాలుగా ఎన్నో ఎన్నో మార్గాలు ఉన్నాయి . కానీ ఈ విధంగా చేస్తే సింపుల్గా నరదిష్టి అనేది పోతుంది అని అంటున్నారు పండితులు. అంతేకాదు మూడు నిమ్మకాయలు 7 ఎండు మిరపకాయలు లేదా పచ్చిమిరపకాయలు ఒక దారానికి కట్టి గుమ్మానికి కట్టినా ఆ నర దిష్టి పోతుంది అంటున్నారు పండితులు. ఆదివారం టెంకాయతో అటు ఇటు మూడుసార్లు తిప్పి టెంకాయ కొట్టినా కూడా నరదిష్టి పోతుంది అని పండితులు అంటున్నారు..!!
నోట్: పైన తెలిపిన వివరాలు కేవలం కొందరు జ్యోతిష్య నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గుర్తుంచుకోవాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం మాత్రమే..!!