గణేశుడిని ఎందుకు నిమజ్జనం చేస్తారు.. దీని వెనుక ఇంత స్టోరీ ఉందా?

frame గణేశుడిని ఎందుకు నిమజ్జనం చేస్తారు.. దీని వెనుక ఇంత స్టోరీ ఉందా?

praveen
వినాయక చవితి వచ్చింది అంటే చాలు ఊరు వాడ అనే తేడా లేకుండా పట్టణం నగరం అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా వినాయకుడి ప్రతిమను ప్రతిష్టించి ఎంతో ఘనంగా వినాయక చవితిని జరుపుకుంటూ ఉంటారు. చిన్నలు పెద్దలు అందరూ కూడా ఒక్కచోట చేరి ఎంతో నిష్టగా గణనాథునికి పూజలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. దీంతో గల్లీ గల్లీకి గణేశుడు ప్రతిమ దర్శనమిస్తూ ఉంటుంది. అయితే గణేశుడికి 9 రోజులపాటు నిష్ఠగా పూజలు చేయడమే కాదు.  ఆ తర్వాత నిమజ్జన కార్యక్రమం చేస్తూ ఉంటారు.

 ఎంతో నిష్టగా పూజలు చేసిన గణేశుడు ప్రతిమను గంగమ్మ ఒడికి చేరుస్తూ ఉంటారు భక్తులు. ఇక ఈ సమయంలో డీజే పాటలు బ్యాండ్ చప్పులతో తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అని చెప్పాలి. దీంతో ఇటీవల కాలంలో గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించడం అనేది ఒకటి ట్రెండుగా మారిపోయింది. ఇక ప్రతి ఒక్కరు గణనాధుని ప్రతిమను ప్రతిష్టించడం తర్వాత నిమజ్జనం చేయడం చేస్తూ ఉంటారు. కానీ ఇలా ఎంతో భక్తితో ప్రతిష్టించుకున్న వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేస్తారు అన్నది మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది

 అయితే ఈ విషయం ఎవరు పెద్దగా పట్టించుకోరు. కానీ ఇలా గణేశుడిని నిమజ్జనం చేయడం వెనుక ఒక పెద్ద స్టోరీనే ఉందట. వినాయక చవితి భాద్రపద మాసంలో వస్తూ ఉంటుంది. ఆ సమయంలో వర్షాలు ఎక్కువగా కురవడం వల్ల.. నదులు కాలువలు చెరువులు అని పొంగిపొర్లుతూ ఉంటాయి. ఇలా నీటి ప్రవాహం వల్ల భూమి మొత్తం కొట్టుకుపోతుంది. దాంతో అక్కడి భూమిలో భూసారం లేకుండా పోతుంది. అయితే వినాయకుడి ప్రతిమలను నిమజ్జనం చేయడం వల్ల సారవంతమైన మట్టి చెరువులు కాలువల్లో చేరుతూ ఉంటుంది. అదేవిధంగా వినాయకున్ని ఆకులు, పువ్వులు పసుపు కుంకుమలతో పూజిస్తారు. ఇక వాటన్నిటిని కూడా నీటిలో కలుపుతారు. అయితే పూజలో వాడే ఆకులు ఆయుర్వేద గుణాలు కలిగి నీటిలో కలపడం వల్ల నీటిలోని సూక్ష్మజీవులు నశించి నీరు మొత్తం స్వచ్ఛంగా మారుతుందట. ఒకప్పుడు ఎక్కువగా చెరువుల్లో నీళ్లు తాగేవారు కాబట్టి ఇక ఈ ఆకుల వల్ల ఔషధ గుణాలు వచ్చి ఎంతోమంది అనారోగ్యం పాడిన పడకుండా ఉండేవారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: