హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు మొదలుపెట్టిన కొత్తపాట..ఏమిటో తెలుసా ?

Vijaya
రామతీర్ధం..రామతీర్ధం అంటూ నాలుగు రోజుల పాటు నానా యాగీ చేసిన ప్రతిపక్షాల నేతల నోళ్ళు ఒక్కసారిగా ఎందుకు పడిపోయాయి ? రామతీర్ధం అయిపోగానే క్రిస్తియన్ అధికారులని, జగన్ కేసుల్లోని అధికారులకు పోస్టింగులంటూ కొత్త పాటను చంద్రబాబునాయుడు ఎందుకు మొదలుపెట్టారు ? ఇదే ఇపుడు ఎవరికీ అర్ధం కావటం లేదు. జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేయటానికి ప్రభుత్వంపై ఆరోపణలు చేయటానికి ఏదో ఒక ఇష్యు కావాలి చంద్రబాబుకు.  ఏ ఇష్యు లేకపోతే వాళ్ళే ఏదో ఒకటి క్రియేట్ చేసుకుంటారు. దాంతో ఓ రెండు రోజులు టైం గడిచిపోతుంది. ఎలాగ భజన చేసే ఎల్లోమీడియా ఉండనే ఉంది కాబట్టి ఇంకో నాలుగు రోజులు టైంపాస్ అయిపోతుంది. ఈ నాలుగు రోజుల్లోనే మళ్ళీ కొత్త అజెండాను రెడీ చేసేసుకుంటారు. నిజంగా ప్రజాసమస్యలపై చంద్రబాబు అయినా టీడీపీ నేతలైనా రోడ్లపైకి వచ్చి పోరాటం చేసి ఎంతకాలం అయ్యిందో.



రామతీర్ధం దేవాలయం విషయంలో ఓ నాలుగురోజుల పాటు చంద్రబాబు అండ్ కో నానా యాగీ చేసేసింది. ఈ సమయంలోనే జగన్ పై క్రిస్తియన్ అనే ముద్ర కూడా వేసేందుకు ప్రయత్నించింది. సరే ఆ ముద్ర ఏమైందో చూసుకునేంతలోపే కొత్త పాటను అందుకున్నారు. అదేమంటే జగన్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరికీ పోస్టింగులు ఇస్తున్నారని. నిజానికి జగన్ అక్రమార్జన కేసులను ఎదుర్కొంటున్న వారిలో చాలామంది రిటైర్ అయిపోయారు. కేసుల్లో ఉన్న వారిలో చాలామంది మీద ఆరోపణలు నిరూపణకాలేదని కేసులను కోర్టులు కొట్టేసిన విషయం అందరికీ తెలిసిందే. చీఫ్ సెక్రటరీ గా వారం క్రితం నియమితులైన ఆదిత్యనాథ్ దాస్ చంద్రబాబు హయాంలో కూడా కీలకంగానే వ్యవహరించారు. ఆయన సర్వీసు రీత్యా అయన్ను ప్రభుత్వం చీఫ్ సెక్రటరీగా నియమించటం కూడా చంద్రబాబుకు మంటగా ఉంది.



ఇక శ్రీలక్ష్మి వ్యవహారం తీసుకుంటే ఆమె తెలంగాణా నుండి ఏపికి కొత్తగా వచ్చారు. చంద్రబాబు సీఎంగా ఉన్నంతకాలం తెలంగాణాలో ఉండిపోయారు. జగన్ సీఎం కాగానే కేంద్రప్రభుత్వంతో మాట్లాడుకుని ఏపిని ఆప్ట్ చేసుకుని వచ్చారు. మరి ఇంతోటిదానికే చంద్రబాబుకు కడుపుమంట ఏమిటో అర్ధంకావటం లేదు. తన నిర్ణయాలను తూచా తప్పకుండా అమలు చేయటానికే కేసుల్లో ఉన్న వారికి కీలక పోస్టింగులు ఇస్తున్నారని చంద్రబాబు ఆరోపించటమే విచిత్రంగా ఉంది. ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించేంత సాహసం చేసే ఉన్నతాధికారులు మనకున్నారా ? చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు ఆయన ఆదేశాలను ఎవరైనా ధిక్కరించారా ?  ఎవరైనా కాదంటే వాళ్ళని చంద్రబాబు ఉండనిచ్చేవారేనా ? ఏమిటో సబ్జెక్టు లేకుండానే రోజు జగన్ పై అదేపనిగా ఆరోపణలు, విమర్శలు చేయాలంటే చంద్రబాబుకు మాత్రం ఎంత కష్టంగా ఉంటుందో ?



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: