రాంచరణ్ : 'గేమ్ ఛేంజర్" రిలీజ్ పై ఫ్యాన్స్ రిక్వెస్ట్..

murali krishna
ఆర్ఆర్ఆర్ సినిమాతో రాంచరణ్ గ్లోబల్ వైడ్ గా ఎంతో పాపులర్ అయ్యారు.రాంచరణ్ కు గ్లోబల్ వైడ్ గా ఫ్యాన్ బేస్ కూడా బాగా పెరిగింది.దీనితో రాంచరణ్ తరువాత సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ "గేమ్ ఛేంజర్",,ఈ సినిమాను తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.క్యూట్ బ్యూటీ అంజలి ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాలో నవీన్ చంద్ర ,సునీల్ ,సముద్రఖని ,ఎస్.జె సూర్య వంటి తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన కూడా దర్శకుడు శంకర్ "ఇండియన్ 2 " సినిమాతో బిజీ గా ఉండటంతో "గేమ్ ఛేంజర్ " షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. 

ఇండియన్ 2 సినిమా రిలీజ్ కు రెడీ అవ్వటంతో శంకర్ గేమ్ ఛేంజర్ సినిమాపై ఫోకస్ పెట్టారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.మొన్నటి వరకు ఈ సినిమా షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాలలో జరుగగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది. వైజాగ్ షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగ్ పూర్తి కానున్నట్లు తెలుస్తుంది.అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలోనే ఫ్యాన్స్ కు ఫుల్ కన్ఫ్యూషన్ వస్తుంది.ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు.అయితే ఈ సినిమాను అక్టోబర్ లో రిలీజ్ చేస్తున్నట్లు దిల్ రాజు కూతురు ఇటీవల ప్రకటించారు.అలాగే అక్టోబర్ 10 న రావాల్సిన దేవర సెప్టెంబర్ 27 కు షిఫ్ట్ అయింది.దీనితో గేమ్ ఛేంజర్ ను అక్టోబర్ 10 న దసరా కానుకగా రిలీజ్ చేయాలనీ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.మరి ఈ ఫ్యాన్స్ రిక్వెస్ట్ ను మేకర్స్ పరిగణలోకి తీసుకుంటారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: