షారుక్ సినిమాలో సమంత.. ఇంతకీ డైరెక్టర్ ఎవరంటే?
అయితే సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ వరుసగా అవకాశాలు అందుకుంటున్న కొంతమందికి అమ్మాయిలు.. అటు నార్తులో కూడా పాగా వేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడ అవకాశాల కోసం ప్రయత్నిస్తుండగా కొంతమందికి.. స్టార్ హీరోల సినిమాలో ఛాన్సులు కూడా దక్కుతూ ఉన్నాయి. అయితే మొన్నటికి మొన్న ఏకంగా జవాన్ సినిమాలో షారుక్ ఖాన్ సరసన సౌత్ ఇండియా సూపర్ స్టార్ గా కొనసాగుతున్న నయనతార నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఇప్పుడు సౌత్లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న మరో ముద్దుగుమ్మ నార్త్ లో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తో జోడి కట్టబోతుందట.
ఇలా షారుఖ్ ఖాన్ సినిమాలో సమంత నటించ పోతున్నట్లు ప్రస్తుతం ఒక వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఈ మూవీని రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించనున్నారు సినీ వర్గాల నుంచి సమాచారం. యాక్షన్ అడ్వెంచర్ పాట్రియాటిక్ అంశాలు మిళితమైన కథతో ఇక ఈ మూవీ రూపొందుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా షారుక్- హిరానీ కాంబినేషన్ లో వచ్చిన ఢంకి మూవీ గత ఏడాది విడతలలై మంచి వసూళ్లు సాధించింది. ఇక మరోవైపు సమంత ఖుషి మూవీ తర్వాత మయోసైటీస్ వ్యాధి బారిన పడటంతో ఇప్పటివరకు సినిమాలకు దూరంగానే ఉంది.