ఆ ఆరోపణలు నిజమైతే బొత్సకు చుక్కలే.. టీడీపీ టార్గెట్ చేయడానికి కారణాలివే!

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ చకచకా అడుగులు పడుతున్నాయి. టీచర్ల బదిలీల విషయంలో బొత్స సత్యనారాయణ అవినీతికి పాల్పడ్డారని వర్ల రామయ్య ఇప్పటికే ఏసీబీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. విజయవాడలోని ఏసీబీ కార్యాలయంలో ఆధారాలతో సహా వర్ల రామయ్య ఫిర్యాదు చేయగా ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది.
 
వర్ల రామయ్య ఫిర్యాదులో బొత్స సత్యనారాయణ ఒక్కో టీచర్ నుంచి 3 లక్షల రూపాయల నుంచి 6 లక్షల రూపాయల వరకు తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ ఆరోపణలు నిజమైతే బొత్స పొలిటికల్ కెరీర్ ప్రమాదంలో పడే ఛాన్స్ అయితే ఉంటుంది. బొత్స సత్యనారాయణ మాత్రం తాను ఎలాంటి అవినీతి చేయలేదని చెబుతున్నారు. అయితే బొత్సను టీడీపీ టార్గెట్ చేయడానికి ప్రత్యేకమైన కారణాలున్నాయి.
 
బొత్స సత్యనారాయణ టీడీపీ నేతలను టార్గెట్ చేస్తూ చాలా సందర్భాల్లో కామెంట్లు చేసిన నేపథ్యంలో టీడీపీ రివర్స్ లో ఆయనను టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఆరోపణలు ప్రూవ్ అయితే మాత్రమే బొత్సకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న బొత్స సత్యనారాయణకు ఈ ఎన్నికల ఫలితాలు భారీ షాకిచ్చిన సంగతి తెలిసిందే.
 
బొత్స సత్యనారాయణ రాజకీయాల్లో భవిష్యత్తు ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా సత్తా చాటుతాననే నమ్మకంతో ఉన్నారు. బొత్స సత్యనారాయణ అవినీతి గురించి వార్తలు రావడం కొత్తేం కాదు. వైఎస్ హయాంలో సైతం బొత్స అవినీతికి పాల్పడ్డారని కామెంట్లు వినిపించాయి. బొత్స సత్యనారాయణ వయస్సు ప్రస్తుతం 65 సంవత్సరాలు కాగా రాబోయే రోజుల్లో ఆయన పొలిటికల్ కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్ర జిల్లాలపై దృష్టి పెడితే ఈ జిల్లాల్లో వైసీపీ పుంజుకోవడం కష్టమైతే కాదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: