టీడీపీ టార్గెట్ లిస్ట్‌: ఈ వైసీపీ నేత‌ల‌కు ఇత్త‌డైపోవాల్సిందే..!

RAMAKRISHNA S.S.
- టీడీపీ హిట్ లిస్టులో అంబ‌టి , రోజా , కొడాలి , వంశీ
- వేటాడి.. వెంటాడి అన్న రేంజ్‌లో ఆట ఉంటుందా .. ?
- ఫ‌స్ట్ జాబితా లోనే బొత్స , కొడాలి , వంశీ , రోజా
( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )
ఏపీలో గ‌త ఐదేళ్ల వైసీపీ ప్ర‌భుత్వంలో కొంద‌రు నేత‌లు తీవ్ర‌మైన మాట‌ల దాడితో అప్ప‌టి ప్ర‌తిప‌క్ష టీడీపీ నేత‌ల‌ను, ఇప్ప‌టి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో పాటు ఆయ‌న త‌న‌యుడు లోకేష్‌ను.. చివ‌ర‌కు చంద్ర‌బాబు భార్య నారా భువ‌నేశ్వ‌రిని సైతం తీవ్ర‌మైన ప‌ద‌జాలంతో అవ‌మానించారు. అయిదేళ్ల కాలంలో వైసీపీ ప్ర‌భుత్వం ఉన్న‌ప్పుడు కొంద‌రు మంత్రులు, ఎమ్మెల్యేలు మామూలుగా రెచ్చిపోలేదు.. ఇటు మాట‌ల‌తో టీడీపీ వాళ్ల‌ను, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌ను వ్య‌క్తిగ‌తంగాను.. పార్టీ ప‌రంగాను దారుణంగా ఆడుకున్నారు.

ఇప్పుడు సీన్ మారిపోయింది. జ‌న‌సేన - టీడీపీ క‌లిసిన కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డింది. ఇప్పుడు వీళ్ల వంతు వ‌చ్చింది. ఇప్పుడు వైసీపీ వాళ్ల‌ను ఆటాడే గేమ్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు టీడీపీ లేదా కూట‌మి ప్ర‌భుత్వం టార్గెట్ లిస్టులో ఉన్న వైసీపీ నేత‌ల గురించి లెక్క‌లు బ‌య‌ట‌కు తీస్తున్నారు. ఎవ‌రు ఎంత‌లా రెచ్చిపోయారు.. వారిని ఎలా .. ఏ కోణంలో... టార్గెట్ చేయాల‌న్న చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ప్ర‌భుత్వం ఒక్క‌సారి అలా కుదురుకుందో లేదో వెంట‌నే వైసీపీలో ఉన్న నేత‌ల‌ను ఆటాడే అస‌లు సిస‌లు గేమ్ స్టార్ట్ కానుంది. టీడీపీ వాళ్ల నోళ్ల‌లో నానుతోన్న ... టీడీపీ హిట్ లిస్టులో ఉన్న ఆ వైసీపీ నేత‌ల పేర్లు ఇవే...

1) వైఎస్‌. జ‌గ‌న్‌
2) ఆర్కే రోజా
3) అంబ‌టి రాంబాబు
4) అనిల్ కుమార్ యాద‌వ్‌
5) ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి
6) బొత్స స‌త్య‌నారాయ‌ణ‌
7) కాకాణి గోవ‌ర్థ‌న్ రెడ్డి
8) పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి
9) వైవి. సుబ్బారెడ్డి
10) స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి

11) విజ‌య సాయిరెడ్డి
12) మార్గాని భ‌ర‌త్‌రామ్‌
13) జోగి ర‌మేష్‌
14) దేవినేని అవినాష్‌
15) పేర్ని నాని
16) వ‌ల్ల‌భ‌నేని వంశీ
17) కొడాలి నాని
వీరితో పాటు మ‌రి కొంద‌రు నేత‌ల అవినీతి, ఇత‌ర చిట్టాల‌ను బ‌య‌ట‌కు లాగుతార‌ని టాక్ ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: