వామ్మో: టాలీవుడ్ కుర్ర హీరోను గుర్తుపట్టారా..?

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రతి సినిమాకు తనని తాను మార్చుకుంటూ మంచి పాపులారిటీ సంపాదించుకున్న కుర్ర హీరోలు చాలా మంది ఉన్నారు.. అలాంటి వారిలో నటుడు శ్రీ విష్ణు కూడా ఒకరు. ముఖ్యంగా తను మాట్లాడే మాటలు కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటారు. సినిమా కోసం ఎలాంటి పాత్రలో నైనా నటిస్తూ ఉంటారు శ్రీ విష్ణు. ఇప్పుడు తాజాగా ఒక ముసలివాడిగా మారిపోయి అందరిని ఆశ్చర్యానికి గురయ్యేలా చేస్తున్నారు శ్రీవిష్ణు. మొదట ఈ హీరోని చూస్తే గుర్తుపట్టడం కూడా చాలా కష్టంగానే మారింది.

ఇటి వలే శ్రీ విష్ణు నటించిన స్వాగ్ సినిమాకి సంబంధించి టీజర్ కూడా విడుదల అయింది. ఈ టీజర్ లో ఎన్నో పాత్రలో కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది శ్రీవిష్ణు. ఈ చిత్రాన్ని హసిత్ గోలి అనే దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. శ్రీ విష్ణు భవభూతి అనే శ్రీ ద్వేషి పాత్రలో కనిపించబోతున్నారు. ఇందులో ఇతని మేకవర్ లుక్స్ చూస్తూ ఉంటే ఆడియన్స్ సైతం ఫిదా అయ్యేలా చేస్తున్నాయి. ముఖ్యంగా శ్రీ విష్ణు ముసలివాడిగా కనిపించడమే కాకుండా చాలా గెటప్పులలో కనిపించబోతున్నట్లుగా ఈ గ్లింప్స్ చూస్తేనే మనకి అర్థమవుతున్నది.

స్వాగ్ చిత్రంలో రీతు వర్మ హీరోయిన్గా నటిస్తున్నది. అలాగే హీరోయిన్ మీరాజాస్మిన్ కూడా ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. మరొక హీరోయిన్ దక్ష నాగర్కర్ కూడా స్పెషల్ రోల్ లో సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా స్టోరీ చూస్తూ ఉంటే.. ఒక పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో కామెడీ ఎంటర్టైన్మెంట్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని చిత్ర బృందం తెలియజేయబోతోంది. మరి శ్రీకృష్ణ మరొక సారి తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తారేమో చూడాలి మరి. చివరిగా ఓం భిమ్ బుష్  చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: