ఏపీ మంత్రులు.. ఏమేం చ‌దివారో చూడండి..!

RAMAKRISHNA S.S.
- బాబు కేబినెట్లో ప్రెష‌ర్స్ - యంగ్‌స్ట‌ర్స్ - విద్యావంతులు
- డాక్ట‌ర్లు , లాయ‌ర్లు , ఇంజ‌నీర్లు ఈ సారి మంత్రులే
( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )
ఏపీ సీఎం చంద్రబాబు క్యాబినెట్లో ఈ సారి గ‌తానికి భిన్నంగా చాలా మార్పులు జ‌రిగాయి. కొత్త మొఖాల‌కు ఛాన్సులు ఇచ్చి.. వృద్ధ నేత‌లు.. సీనియ‌ర్ల‌ను ప‌క్క‌న పెట్టేశారు. ఈ సారి బాబు కేబినెట్ లో కొత్త వారితో పాటు ఉన్నత విద్యావంతులు - మంత్రివర్గంలో డాక్టరేట్‌లు, లాయర్లు, ఇంజినీర్లు ఉన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో వైద్య, న్యాయ పట్టభద్రులతో పాటు ఇంజినీరింగ్, ఎంబీఏ, పీజీ, పీహెచ్‌డీ చేసినవారు సైతం ఉండ‌డం విశేషం. ఒక్క‌సారి ఏం మంత్రి ఎంత వ‌ర‌కు చ‌దువుకున్నారో కింద తెలుసు కుందాం.

- సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎంఏ ఎకనామిక్స్‌ చదివారు.
- జనసేన నుంచి మంత్రి అయిన కందుల దుర్గేష్‌కు కూడా సేమ్ టు సేమ్ చంద్ర‌బాబు విద్యార్హత ఉంది.
- ధ‌ర్మ‌వ‌రంలో ఫ‌స్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచి బీజేపీ నుంచి మంత్రి అయిన సత్యకుమార్‌ ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌ చేశారు.
- నారా లోకేశ్‌ స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయంలో, టీజీ భరత్‌ బ్రిటన్‌లో ఎంబీఏ, కొండపల్లి శ్రీనివాస్‌ అమెరికాలో ఎంఎస్ చేశారు.
- నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్‌ ఇక్కడే వ్యాపార నిర్వహణలో మాస్టర్స్‌ చేశారు.
- గొట్టిపాటి రవికుమార్‌ ఇంజినీరింగ్‌ చదివారు.
- డోలా బాల వీరాంజనేయస్వామి వైద్య విద్యను అభ్యసించారు.

- మండిపల్లి రాంప్రసాద రెడ్డి బీడీఎస్ చదువు మధ్యలో ఆపేశారు.
- నిమ్మల రామానాయుడు ఎంఏ, ఎంఫిల్, పీహెచ్‌డీ చేసి డాక్టరేట్‌ను అందుకున్నారు.
- ఆనం రామనారాయణరెడ్డి, వాసంశెట్టి సుభాష్‌, కొల్లు రవీంద్ర న్యాయ విద్య పూర్తి చేశారు.
- కొండపల్లి శ్రీనివాస్‌ యూఎస్‌లో ఎంఎస్ చదవగా పి.నారాయణ, వంగలపూడి అనిత పోస్టు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు.
- సవిత, సంధ్యారాణి, బీసీ జనార్దనరెడ్డి, కొలుసు పార్థసారథి, అనగాని సత్య ప్రసాద్‌ డిగ్రీ చదివారు.
- అచ్చెన్నాయుడు బీఎస్సీ మధ్యలో ఆపేశారు.
-  ఎన్‌ఎండీ ఫరూక్‌ ఇంటర్మీడియట్‌ పూర్తి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: