శభాష్‌.. హైదరాబాద్‌ పోలీస్‌.. 24 గంటల్లోనే దొంగల్ని పట్టేశారు?

Chakravarthi Kalyan
హైదరాబాద్ మేడ్చల్‌ పోలీసులు శభాష్ అనిపించుకున్నారు. మేడ్చల్ లో జువెలరీ షాప్ దోపిడీ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు. మొన్న జగదాంబ జువెలరీ షాప్ లో ఇద్దరు దుండగులు మాస్క్, బుర్ఖా ధరించి యజమానిని కత్తితో పొడిచి డబ్బు ఎత్తుకెళ్లారు. సిసి కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకున్న పోలీసులు.. నిందితులను ప్రవేశపెట్టారు.
ఈ నెల20 న జగదాంబ షాప్ లో నగలు , నగదు చోరీ చేశారు. 40 సెకండ్లు మాత్రమే షాప్ లో ఉంది విధ్వంసం చేశారు. వీరిని పట్టుకునేందుకు పోలీసులు మొత్తం 200 సీసీ కెమెరాలు పరిశీలించారు. కిలో మీటరు దూరం లో బైక్ వదిలిపెట్టి దొంగలు పరారయ్యారు. ఓయు, హబ్సిగూడలో దొంగలు ఆ బైక్ దొంగలించారు. 16 బృందాలను రంగంలోకి దింపిన పోలీస్ శాఖ 24 గంటల్లోనే దొంగలను పట్టుకుంది. గతంలో చాదర్ ఘాట్ లో జరిగిన చోరీ కేస్ కూడా వీళ్ళే ఉన్నారు. నిందితులు నజీం, సోహాయిల్ బంగారు షాప్ లను లక్ష్యంగా చేసుకొని  చోరీలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: