ప‌వ‌న్‌ను బూతులు తిట్టిన ద్వారంపూడి పొగ‌రు అణిచేసే స్కెచ్ ఇది..!

RAMAKRISHNA S.S.
- ప‌వ‌న్ ఎలా గెలుస్తాడో చూస్తా అని చిత్తుగా ఓడిన చంద్ర‌శేఖ‌ర్‌
- కాపులు, జ‌న‌సేన ఫ్యాన్స్ ఆటాడుకోవ‌డం ఖాయం
- కాకినాడ పోర్టు నుంచే ఆట మొద‌లెట్టిన కొత్త స‌ర్కార్‌
( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )
కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు ద్వారం పూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డికి మూడిన‌ట్టే నా?  ఆయ‌న ప్ర‌స్తుత ప్ర‌భుత్వానికి టార్గెట్ అవుతున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. టీడీపీ స‌ర్కారు ప‌రిస్థితి ఎలా ఉన్నా.. కూట‌మిలో భాగస్వామ్య ప‌క్షంగా ఉన్న జ‌న‌సేన నాయ‌కులు మా త్రం ద్వారం పూడిని వ‌దిలి పెట్ట‌బోర‌ని తెలుస్తోంది. ఎన్నిక‌ల‌కు రెండు సంవ‌త్స‌రాల ముందు నుంచి కూడా.. ద్వారంపూడి జ‌న‌సేన‌ను టార్గెట్ చేశారు.

ముఖ్యంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఆయ‌న టార్గెట్ చేసుకుని తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ప‌వ‌న్ ఎలా గెలుస్తాడో చూస్తామ‌న్నారు. అదేస‌మ‌యంలో జ‌న‌సేన నాయ‌కుల‌పైనా ఆయ‌న విరుచుకుప‌డ్డారు. కాళ్లు ప‌ట్టుకుని పొత్తు పెట్టుకున్నారంటూ.. బీజేపీ విష‌యంలో జ‌న‌సేన‌ను తీవ్రంగా విమ‌ర్శించారు. అదే స‌య‌మంలో జ‌న‌సేన నాయ‌కుల‌పైనా ఆయ‌న కేసులు పెట్టించారు. కాపులు బ‌లంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గా ల్లో వారిని కూడా టార్గెట్ చేశారు. దీంతో ఇటు జ‌న‌సేన‌, అటు కాపుల్లోనూ ద్వారం పూడి పొగ‌రు అణ‌చాల‌నే డిమాండ్ అప్ప‌ట్లోనే వ‌చ్చింది.

ఫ‌లితంగా ఎన్నిక‌ల్లో వారు స‌త్తా చూపించారు. జ‌న‌సేన పోటీ చేసిన తూర్పులో అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ  గెలిపించారు. ఇక‌, ఇప్పుడు స‌ర్కారు ఏర్ప‌డిన ద‌రిమిలా.. ద్వారం పూడిని టార్గెట్ చేయ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది.  ప్ర‌ధానంగా ద్వారంపూడి వ్యాపార‌లైన రైస్ మిల్లులు, బియ్యం ఎగుమ‌తుల విష‌యంలో జ‌న‌సేన నాయ‌కులు ఆయ‌న‌పై కేసులు పెట్టి.. త‌ద్వారా స‌ర్కారుతో చ‌ర్య‌లు తీసుకునే లా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం ఉంది. అదేస‌మ‌యంలో వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శ‌లు చేసిన ద్వారం పూడిపై అదేస్థాయిలో విరుచుకుప‌డ‌నున్నారు.

మ‌రీ ముఖ్యంగా కాకినాడ పోర్టులో ఇప్ప‌టి వ‌ర‌కు ద్వారం పూడికి స‌హ‌క‌రిస్తున్న అధికారుల‌ను త‌క్ష‌ణ‌మే బ‌దిలీ చేయించ‌డంతోపాటు.. ఇక్క‌డ నిఖార్స‌యిన అధికారుల‌ను నియ‌మించేందుకు కూడా.. ప్ర‌య త్నించ‌వ‌చ్చు. తద్వారా.. ఇప్ప‌టి వ‌ర‌కు కాకినాడ పోర్టును అడ్డాగా చేసుకుని ద్వారంపూడి సాగించిన వ్యాపార సామ్రాజ్యాన్ని కూల్చేసినా ఆశ్చ‌ర్యం లేదు. ఫ‌లితంగా ద్వారం పూడి ఆర్థిక మూలాల‌ను కూల‌గొట్టి ఆయ‌న‌ను నిస్స‌హాయ స్థితికి తీసుకువ‌స్తే.. ఇక‌, పొగ‌రు దానంత‌ట అదే అణిగిపోతుంద‌ని జ‌న‌సేన నాయ‌కులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: