హెరాల్డ్ సెటైర్ : అమరావతి ప్లేసులో చంద్రబాబుకు కొత్త సమస్య దొరికిందా ?
జగన్ సర్కార్ ఏర్పాటై ఏడాదిన్నర అవుతున్నా ఇప్పటి వరకు ఒక్క ఇంటిని కూడా పేదలకు ఇవ్వలేదు. పైగ తన హయాంలో 6 లక్షల ఇళ్ళను నిర్మించినా వాటిని కూడా పేదలకు జగన్ ఇవ్వలేదంటూ కొత్త గోల మొదలుపెట్టారు చంద్రబాబు. అయితే ఇక్కడే ఓ చిన్న లాజిక్ ఉంది. అదేమిటంటే నిజంగానే టీడీపీ హయాంలో 6 లక్షల ఇళ్ళు నిర్మించేసుంటే మరి అధికారంలో ఉన్నపుడే చంద్రబాబు వాటిని పేదలకు ఎందుకు పంపిణీ చేయలేదు ? అప్పట్లో సామూహిక గృహప్రవేశాలంటూ చాలా పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు వేయించుకున్నారు కదా. మరి అదే నిజమైతే వాటి తాళాలను లబ్దిదారులకు ఎందుకు ఇచ్చేయలేదు ? అప్పట్లో పేదల కోసం నిర్మించిన ఇళ్ళను చంద్రబాబే లబ్దిదారులకు ఇచ్చేసుంటే ఇఫుడు గోల చేసే అవసరమే ఉండేది కాదు కదా ?
ఈ సమస్యలకు వైసీపీ నేతలు చెబుతున్న జవాబులు గట్టిగానే ఉన్నాయి. అవేమిటంటే చంద్రబాబు హయాంలో లక్షల ఇళ్ళు నిర్మించారన్నది పూర్తిగా అబద్ధమట. కేవలం ప్రచారం కోసం, ఎన్నికల్లో లబ్దిపొందటం కోసమే ఇళ్ళు నిర్మించినట్లు చంద్రబాబు నాటకాలు ఆడినట్లు ఆరోపిస్తున్నారు. నిజంగానే చంద్రబాబు హయాంలో అన్ని లక్షల ఇళ్ళు కట్టేసుంటే మరి లబ్దిదారులకు ఎందుకివ్వలేదనే ప్రశ్నలకు చంద్రబాబు అండ్ కో నుండి సమాధానాలు రావటం లేదు. చంద్రబాబు హయాంలో మొదలై ఇళ్ళ నిర్మాణంలో కనీసం 50 వేలు కూడా నివాసయోగ్యం కాదంటున్నారు వైసీపీ నేతలు. లక్షల సంఖ్యలో ఇళ్ళను కట్టేసినట్లు చంద్రబాబు అండ్ కో అంటున్నారు. కట్టలేదని వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. మరి వీళ్ళద్దరి వాదనల్లో ఎవరిది కరెక్టు ?